1.దుర్గగుడి ఉద్యోగులపై ఈవో చర్యలు
దుర్గమ్మ గుడిలో ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందికి ఇంక్రిమెంట్లలో కోత విధించారు.
2.ఎంపీ రాజా కు సీబీఐ కోర్టు సమన్లు
ఆదాయానికి మించి ఆస్తులు కూడ పెట్టారంటూ డీఎంకే ఎంపీ రాజాను జనవరి 10 నేరుగా హాజరుకావాలని నలుగురుకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
3.రాష్ట్రానికి ఇదేం కర్మ ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ‘రాష్ట్రానికి ఇదేం కర్మ ‘పేరుతో వైసిపి పై వినూత్న పోరాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
4.టిడిపి కార్యకర్తలకు ప్లాస్కులు అందించిన మాగంటి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సందర్భంగా టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబు కార్యకర్తలకు ప్లాస్క్ లు పంపిణీ చేశారు.
5.ములుగు ఏజెన్సీలో హై అలర్ట్
డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే పి ఎల్ జి ఏ వారోత్సవాలు నేపథ్యంలో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది.
6.గుడివాడలో రైతుల ఆందోళన
కృష్ణాజిల్లా గుడివాడలో రైతులు ఆందోళనకు దిగారు.ధాన్యం కొనుగోలు చేయాలంటూ పామర్రు కత్తిపూడి జాతి రహదారిపై రైతులు రాస్తో రోకో నిర్వహించారు.
7.విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమాకు సంబంధించి ఈ చిత్ర పెట్టుబడులపై ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విజయ్ దేవరకొండ ను ఈరోజు ప్రశ్నించనున్నారు.
8.అప్పుల పై ఆర్థిక మంత్రి చర్చకు రావాలి : ఈటెల
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చికి రావాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.
9.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు హైకోర్టు విచారణ
తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో హైకోర్టులో నేడు విచారణ జరిగింది.బిజెపి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మహేష్ జట్నాలని వాదనలు వినిపించారు.
10.మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సీబీఐ సోదాలు
మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.
11.షర్మిలపై కవిత సెటైర్లు
వైయస్సార్ టిడిపి అధినేత్రి షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు.ఈ మేరకు ట్వీట్ చేశారు.
12.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గుండె గావ్ లో ప్రారంభమైంది.
13.పొన్నం ప్రభాకర్ కామెంట్స్
తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు పాదయాత్ర చేసే హక్కు లేదా అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
14.జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తుల అటాచ్
బి ఎస్ ఫోర్ వాహనాల రిజిస్ట్రేషన్ల లో అవకతవకలు జరిగిన కేసులో టిడిపి సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు.ప్రభాకర్ రెడ్డికి చెందిన 22.10 కోట్ల ఆస్తులను ఈడి అధికారులు అటాచ్ చేశారు.
15.రష్యా కు వెళ్లిన అల్లు అర్జున్
పుష్ప పార్ట్ 1 రష్యాలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరో అల్లు అర్జున్ రష్యా కు వెళ్లారు.
16.ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం
ఎయిర్ ఇండియాలో విస్తరా ఎయిర్ లైన్స్ ను విలీనం చేస్తున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది.
17.అయ్యన్న కామెంట్స్
మూడు రాజధానుల ప్రసక్తే లేదని , రాజధానుల ను మార్చే అధికారం జగన్ కు లేదని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
18.షర్మిల పాదయాత్ర ను అడ్డుకోవడం సరికాదు
షర్మిల పాదయాత్ర ను అడ్డుకోవడం సరికాదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
19.గ్రూప్స్ నోటిఫికేషన్ల పై కసరత్తు
తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన గ్రూప్ 1, 2,3 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ లు జారీ చేయడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
20.ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడి గా ఉన్న అమిత్ అరోరా ను ఈడి కస్టడీలోకి తీసుకున్నారు.