టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) కు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈరోజు బన్నీ పుట్టినరోజు సందర్బంగా స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
గతేడాది బన్నీ( Bunny ) వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక విధంగా బన్నీకి పీడకల అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.అయితే ఆ సమయంలో బన్నీకి స్నేహారెడ్డి ఎంతో సపోర్ట్ గా నిలిచారు.
ఈరోజు బన్నీ 43వ పుట్టినరోజు కాగా 42 ఏళ్ల కెరీర్ లో బన్నీ ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

2025 సంవత్సరంలో అల్లు అర్జున్ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని స్నేహారెడ్డి( Sneha Reddy ) తెలిపారు.ఈ జీవితంలో బన్నీతో కలిసి నడుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ ఆమె చెప్పుకొచ్చారు.
కుటుంబంతో సంతోషంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఆమె పంచుకోవడం జరిగింది.

అల్లు అర్జున్ నటించిన సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.అల్లు అర్జున్ మరిన్ని రికార్డులను రాబోయే రోజుల్లో సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.