సాధారణంగా చాలా మంది తమ ముఖం ఫ్రెష్‌గా, గ్లోగా వెలిగి పోవాలని మార్కెట్‌లో దొరికే ఖరీదైన ఫేస్ వాష్‌లను కొనుగోలు చేసి తెగ వాడుతుంటారు.ఇటు వంటి వల్ల ముఖం ఎంత ఫ్రెష్‌గా మారుతుందీ అన్న విషయం పక్కన పెడితే.
డబ్బులు మాత్రం లెక్కకు మిక్కిలిగా ఖర్చు అవుతుంటాయి.అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.
మార్కెట్‌లో లభ్యమయ్యే ఫేస్ వాష్‌లతోనే కాదు, ఇంట్లో తయారు చేసుకునే న్యాచురల్ ఫేస్ వాష్‌లతోనూ ముఖాన్ని ఫ్రెష్‌గా మెరిపించుకోవచ్చు.
అందుకు ముఖ్యంగా ఓట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.
అవును, ఓట్స్‌లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు ముఖానికి మంచి ఫ్రెష్‌ను లుక్‌ను అందించగలవు.మరి ఓట్స్‌ను ఫేస్ వాష్ గా ఎలా యూజ్ చేయాలో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్, ఒక స్పూన్ మల్తానీ మట్టి, రెండు చుక్కలు లావెండర్ ఆయిల్ వేసుకుని కలుపు కోవాలి.ఇప్పుడు ఈ పౌడర్‌కు వాటర్ యాడ్ చేసి ముఖానికి అప్లై చేసి.
మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా రుద్దు కోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేశారంటే.చర్మంపై పేరుకు పోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు పోతాయి.
మరియు అదనపు జిడ్డు సైతం తొలిగి పోయి ఫేస్ ఫ్రెస్‌గా, అందంగా మెరుస్తుంది.
అలాగే ఓట్స్ ఉపయోగించి మరో విధంగా కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు.అందు కోసం బౌల్‌లో ఒక స్పూన్ ఓట్స్, ఒక స్సూన్ తేనె మరియు వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమంతో ముఖంపై గుండ్రంగా రుద్దాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా ముఖం తాజాగా, మృదువగా మారుతుంది.