పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా మార్చి నెల 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీ నుంచి ఈ సినిమా మే నెల 9వ తేదీకి వాయిదా పడింది.అయితే హరిహర వీరమల్లు మూవీ ఆ సమయానికి రిలీజ్ కాని పక్షంలో అదే తేదీన నితిన్( Nithin ) నటించిన తమ్ముడు మూవీ( Thammudu Movie ) రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
త్వరలో తమ్ముడు మూవీ ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.రాబిన్ హుడ్ సినిమా( Robinhood ) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదనే సంగతి తెలిసిందే.

అయితే నితిన్ పవన్ కళ్యాణ్ డేట్లను టార్గెట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.హీరో నితిన్ పవన్ కు వీరాభిమాని కాగా పవన్ సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టే నితిన్ ఆ తేదీల్లో తన సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నితిన్ తర్వాత సినిమాలతో భారీ హిట్లు అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నితిన్ కు కెరీర్ పరంగా తిరుగుండదని కచ్చితంగా చెప్పవచ్చు.నితిన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.నితిన్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.
నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో వెంకీ కుడుముల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.