ఇటీవల రోజుల్లో ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాగే వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది రక్తహీనతకు బాధితులుగా ఉన్నారు.
అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే ఓ అద్భుతమైన స్మూతీ ఉంది.వారంలో కేవలం రెండు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదు రక్తహీనత సైతం పరార్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బాగా పండిన ఒక పైనాపిల్( Pineapple ) ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు ఫ్రెష్ పాలకూర ( Spinach )ఆకులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాస్ హోమ్ మేడ్ కొబ్బరి పాలు లేదా బాదం పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన పైనాపిల్ పాలకూర స్మూతీ సిద్ధం అవుతుంది.
ఈ స్మూతీ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.
ఈ స్మూతీ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది.వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.
అలాగే ఈ పైనాపిల్ పాలకూర స్మూతీలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

అందువల్ల ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత ( Anemia )పరార్ అవుతుంది.అంతేకాదు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలను తొలగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.మలబద్దకం సమస్య దూరం అవుతుంది.
మరియు జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.