బుల్లితెరపై కలర్స్ స్వాతిగా( Colors swathi ) కలర్స్ అనే ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసి పరిచయమైన స్వాతి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.ప్రస్తుతం ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.
అయితే స్వాతి మొదట హీరోయిన్ అవ్వాలని లేదా నటి అవ్వాలని అనుకోలేదు.కేవలం యాంకరింగ్ చేసి తనలోని ప్రతిభను అందరికీ చూపించాలి అనుకుంది.
అయితే అనుకోకుండా వచ్చిన అదృష్టంతో ఆమె బుల్లితెర నుంచి వెండి ధరకు కూడా వెళ్ళిపోయింది హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా( heroine, character artist ) కొన్ని సినిమాల్లో నటించింది.ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది కానీ ఇప్పుడు మళ్లీ ఆమె సినిమాల్లో నటించాలనే తహతహలాడుతుంది.

లాంగ్ టైం తన కెరీయర్ ను నటిగా కొనసాగించకపోవడానికి గల ప్రధాన కారణం తను ఎవరిని ఏ రోజు అవకాశాల కోసం అడగక పోవడమే అంటుంది కలర్స్ స్వాతి.పోర్ట్ఫోలియో ( Portfolio )లాంటివి చేయకుండా తన ప్రొఫైల్ ని ఎవరికీ చూపించకుండా తనకు వచ్చిన అవకాశాల్లో మాత్రమే నటిస్తూ తాను ఈ స్థాయి వరకు వచ్చానని, అంతేకానీ ఏ ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగి తనకు అవకాశం ఇవ్వండి అని అడగలేదని అందువల్లే చాలామంది నాకు పొగరు అని కూడా అనుకుంటూ ఉంటారని తెలుపుతుంది.పైగా తాను ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను కాబట్టి తను మాట్లాడే పద్ధతి కూడా కొంతమందికి నచ్చదు అంటూ చెబుతోంది.

ప్రస్తుతం స్వాతి మరోసారి తన అదృష్టాన్ని టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో పరీక్షించుకుంటుంది.మంత్ ఆఫ్ మధు అనే చిత్రం లోనే మరియు సత్య అనే ఒక మ్యూజిక్ వీడియో లో కూడా నటిస్తోంది.ఇవి కనుక వర్కౌట్ అయితే మళ్ళీ తాను సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతానని స్వాతి అనుకుంటుంది.
ఇక 2018లో తన బాయ్ ఫ్రెండ్ నీ పెళ్ళాడిన స్వాతి కొన్నాళ్ల పాటు ఫారిన్ లో కూడా ఉంది.ఇక ఇప్పుడు తన వైవాహిక జీవితం కూడా కాస్త ఒడిదుడుకుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి మన తెలుగు తేజం మళ్ళీ ఇండస్ట్రీలో మెరిసే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.