బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా.. అయితే వారానికి రెండు సార్లైనా ఈ జ్యూస్ ను మీరు తాగాల్సిందే!!

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.ఓవర్ వెయిట్( Overweight ) ను కొందరు నిర్లక్ష్యం చేస్తే.

 This Juice Helps To Lose Over Weight Quickly! Weight Loss, Weight Loss Juice, La-TeluguStop.com

మరికొందరు దాన్ని తగ్గించుకోవడం కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీరు వారానికి రెండు సార్లైనా తాగాల్సిందే.ఎందుకంటే ఈ జ్యూస్ మరింత వేగంగా వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడుతుంది.అదే సమయంలో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు ఆరెంజ్ పండ్ల‌ను తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పీల్ తొలగించిన పైనాపిల్ ముక్కలు, ఒక గ్లాస్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy, Latest, Pineappleorange-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ఈ పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది బెస్ట్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు.

వారానికి కనీసం రెండుసార్లు ఈ జ్యూస్ ను కనుక తాగితే జీవక్రియ చురుగ్గా మారుతుంది.శరీరంలో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.దాంతో మీరు మరింత త్వరగా బరువు తగ్గుతారు.

Telugu Tips, Healthy, Latest, Pineappleorange-Telugu Health

అలాగే ఈ పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి మ‌రియు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ బలమైన రోగనిరోధక వ్యవస్థ కు దోహదం చేస్తాయి.అనేక జ‌బ్బుల నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షిస్తాయి.పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ కొలెస్ట్రాల్( High cholesterol ) ను త‌గ్గించ‌డానికి మరియు రక్తపోటును అదుపులో ఉంచ‌డానికి సహాయపడుతుంది.

గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది.అంతేకాకుండా కణితులు ఏర్పడకుండా నిరోధించడానికి, వాటి పరిమాణాన్ని తగ్గించడానికి లేదా క్యాన్సర్ కణాల మరణానికి కూడా ఈ జ్యూస్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప‌లు ఆధ్య‌య‌నాలు సూచిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube