దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గడంతో కరోనాను కట్టడి చేసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కానీ గత కొన్నిరోజుల నుంచి మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
వరుసగా రెండో రోజు 16 వేల కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.దేశంలో గత 24 గంటల్లో 16,577 కొత్త కేసులు నమోదు కాగా 120 మంది కరోనా వైరస్ సోకి చనిపోయారు.
కొత్తగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.అయితే కరోనా సోకి కోలుకున్న వారిని కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.మహిళలు కరోనా నుంచి కోలుకున్న 180 రోజుల తరువాత ఎక్కువగా జుట్టు రాలుతోంది.
ది లాన్సెట్ చేసిన అధ్యయనంలో తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

శాస్త్రవేత్తలు చైనాలో ఉన్న 1655 మంది మహిళలపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.మొత్తం 1655 మందిపై చేసిన పరిశోధనలలో 359 మంది మహిళలు ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్నారు.శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనా నుంచి కోలుకున్న మహిళలు నిద్రలేమి సమస్యతో పాటు ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని వెల్లడైంది.
కరోనా బారిన పడుతున్న వారిలో పురుషులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కరోనా నుంచి కోలుకున్న తరువాత మహిళలనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.మరోవైపు మార్చి 1వ తేదీ నుంచి 45 సంవత్సరాల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది.
అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుండటం గమనార్హం.