వేల్స్‌కు చెందిన జేమ్స్ వైస్( James Wise ) (31) అనే ఓ మాజీ బార్‌టెండర్ ఓ అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చాడు.ఏళ్ల తరబడి మనల్ని వేధిస్తున్న ఓ పెద్ద సమస్యకు చెక్ పెట్టేశానని అంటున్నాడు.
అదేంటంటే.ఫ్రిడ్జ్ లేకపోయినా సరే, డ్రింక్స్‌ను చల్లగా ఉంచుకోవడం.
ఇందుకోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దానంతట అదే చల్లబడే క్యాన్‌ను కనిపెట్టాడు.దీని పేరు “కూల్ క్యాన్”.
ఈ అద్భుత ఆవిష్కరణ ఇప్పటికే కోకా-కోలా, రెడ్ బుల్, ఏబీ ఇన్‌బెవ్, మోల్సన్ కూర్స్( Coca-Cola, Red Bull, AB InBev, Molson Coors ) లాంటి పెద్ద పెద్ద డ్రింక్ కంపెనీల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
ఈ కూల్ క్యాన్ పనిచేసే విధానం చాలా సింపుల్, కానీ ఎఫెక్టివ్.
క్యాన్ కింది భాగంలో నీళ్లతో నిండిన ఓ చిన్న ట్యాంక్ (రిజర్వాయర్) ఉంటుంది.క్యాన్ గోడల మధ్య ఖాళీల్లో (హోలో వాల్స్) ప్రత్యేకమైన ఉప్పు స్పటికాలు (సాల్ట్ క్రిస్టల్స్) ఉంటాయి.
మనం క్యాన్‌పై ఉన్న ఓ బటన్ నొక్కగానే.లోపలున్న నీళ్లు, ఉప్పు కలిసిపోతాయి.
అంతే, ఓ కెమికల్ రియాక్షన్ మొదలై, క్యాన్‌లోని డ్రింక్‌ను క్షణాల్లో కూల్ చేసేస్తుంది.
అయితే, ఈ క్యాన్ చూడటానికి రెగ్యులర్ 500ml క్యాన్ లాగే కనిపిస్తుంది కానీ, ఇందులో పట్టేది మాత్రం 350ml డ్రింక్ మాత్రమే.ఎందుకంటే, డ్రింక్‌ను చల్లబరిచే ప్రాసెస్ కోసం లోపల కొంత ఇన్సులేటెడ్ ఖాళీ స్థలం అవసరం మరి.అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే.“డ్రింక్ టేస్ట్ ఎంత బాగున్నా, అది వేడెక్కితే కిక్ ఏముంటుంది” అనేది వైస్ ఫీలింగ్.ఫ్రిడ్జ్ నుంచి తీసిన కాసేపటికే డ్రింక్స్ చల్లదనం కోల్పోవడం అతనికి నచ్చేది కాదు.“స్పేస్ ట్రావెల్‌లో వాడే టెక్నాలజీ అంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటే, మామూలు డ్రింక్ క్యాన్‌లు పట్టుమని 10 నిమిషాలకే ఎందుకు వేడెక్కిపోతున్నాయి.” అని ఆలోచించాడు.ఆ ఆలోచనే ఈ ఆవిష్కరణకు దారితీసింది.
ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని గట్టిగా ఫిక్స్ అయిన వైస్, రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు.ఏకంగా 500కు పైగా ప్రోటోటైప్స్ తయారుచేసి, చివరికి ఈ పర్ఫెక్ట్ డిజైన్‌ను రెడీ చేశాడు.ఈ వేసవిలో లండన్‌లో దీని ట్రయల్స్ జరగనున్నాయి.
మరో రెండేళ్లలో భారీ ఎత్తున ఉత్పత్తి కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది.కేవలం డ్రింక్స్ పరిశ్రమకే కాదు, ఈ సెల్ఫ్-కూలింగ్ టెక్నాలజీ పర్యావరణానికి కూడా మేలు చేసే అవకాశం ఉంది.
ఐక్యరాజ్యసమితి (United Nations) లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్‌లో ఏకంగా 17% కేవలం రిఫ్రిజిరేషన్ కోసమే వాడుతున్నారట! కాబట్టి, ఈ కూల్ క్యాన్ వాడకం పెరిగితే.కరెంట్ వాడకం, కాలుష్యం (కార్బన్ ఎమిషన్స్) గణనీయంగా తగ్గుతాయి.
ముఖ్యంగా, ఫ్రిడ్జ్‌లు, కూలింగ్ సౌకర్యాలు అంతగా లేని ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది.