వీడియో: ఇసుక తింటున్నానని భార్య ప్రాంక్.. భర్త రియాక్షన్ వైరల్!

సోషల్ మీడియాలో ఫుడ్ ప్రాంక్ (Food Prank)వీడియోలు వైరల్ అవుతున్న రోజులివి.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

 Wife Pranks Him By Saying She's Eating Sand.. Husband's Reaction Goes Viral!, Wi-TeluguStop.com

@realcarmack, @erinslaver అనే ఇన్‌స్టా యూజర్లు పోస్ట్ చేసిన వీడియోలో, ఓ భార్య తన భర్తకు ఇసుక తింటున్నట్టు ప్రాంక్ (Prank of eating sand)చేసింది.కానీ అసలు విషయం ఏంటంటే ఆ ఇసుక కాదు, నలిపిన కుకీలు.ఈ ట్విస్ట్ తెలియకపోయేసరికి భర్త రియాక్షన్ మాత్రం అదిరిపోయింది.

వీడియో మొదట్లోనే “ఇది ఇసుక కాదు, నలిపిన కుకీలు” అని రాసి ఉంటుంది.

కానీ అది వీడియో చూసేవాళ్ల కోసమే, పాపం భర్తకు తెలీదు.బీచ్‌లో కూర్చున్న భార్య చిన్న టాయ్ బకెట్‌లో కుకీల పొడిని ఇసుకలాగా సెటప్ చేసుకుంది.

కెమెరాకు ఫేస్ చేసి, “నేను ఇసుక తినబోతున్నా(eating sand)” అని అనౌన్స్ చేసింది.దాంతో వెనకాలే ఉన్న భర్త (Husband)వెంటనే రియాక్ట్ అయ్యాడు.“వద్దు, వద్దూ, అది అన్‌హైజెనిక్, కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయి” అని వారించాడు.కానీ భార్య వింటుందా ఏంటి, తన ప్లాన్ ప్రకారం ముందుకు సాగింది.

చిన్న ప్లాస్టిక్ స్పూన్‌తో ఆ ‘ఇసుక’ను ఎత్తి నోట్లో వేసుకుని నమిలింది.భర్త షాక్ అయి అలా చూస్తుండిపోయాడు.నిజంగా ఇసుక తింటోందని నమ్మేసి ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.భార్య మాత్రం నటిస్తూ అది ఎలా ఉందో టేస్ట్ గురించి కూడా చెప్పింది.ఆ తర్వాత కాస్త టేస్ట్ చేయమని భర్తకు కూడా ఇచ్చింది.మొదట కాస్త వెనకాడినా, తర్వాత టేస్ట్ చేశాడు.

అప్పుడే అతనికి తెలిసింది అది ఇసుక కాదు, కుకీలని.

కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు మాత్రం భర్త కన్ఫ్యూజన్ అవ్వడన్ని చూసి పగలబడి నవ్వుతున్నారు.“అసహ్యంగా ఉన్నా కూడా టేస్ట్ చేశాడే” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఆమె మాత్రం సూపర్, ఏం ప్రాంక్ చేసింది.” అని ఇంకొకరు అన్నారు.వీడియో చాలా ఎడిట్ చేశామని, నిజానికి తన భర్త నిజమైన ఇసుకను టేస్ట్ చేసేంత వరకు వెళ్లిందని ఎరిన్ తర్వాత చెప్పింది.ఈ వీడియో చూసిన వాళ్లకి ఇంకో ఫుడ్ ప్రాంక్ వీడియో గుర్తొచ్చింది.

అందులో ఒక తల్లి ఫ్రైస్ లాగా అల్లం ముక్కల్ని వేయించి పిల్లలకు పెట్టి ప్రాంక్ చేసింది.అవి చూడటానికి అచ్చం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉన్నాయి మరి.ఇలాంటి ఫుడ్ ప్రాంక్స్ సోషల్ మీడియా యూజర్లను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.సరదాగా, సర్‌ప్రైజింగ్‌గా ఉండే ఈ ప్రాంక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube