ప్రస్తుత ఆధునిక కాలంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి లేదా ఫ్యాషన్ పేరుతో చాలా మంది స్మోకింగ్( Smoking ) కు అలవాటు పడుతున్నారు.క్రమంగా స్మోకింగ్ అనేది వ్యసనంగా మారిపోతుంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు.సిగరెట్స్‌లో నికోటిన్‌తో పాటు హానికరమైన రసాయనాలు నిండి ఉంటాయి.
అవి శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.
ఇకపోతే స్మోకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్( Weight Loss ) అవుతారని కొందరు నమ్ముతూ ఉంటారు.ధూమపానం ఆకలిని అణిచివేస్తుంది.
ఆకలిని తాత్కాలికంగా అణిచివేయడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.ఇది బరువు తగ్గడానికి దారితీస్తుందని భావిస్తారు.
కానీ స్మోకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారన్నది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి ధూమపానం వ్యసనం వల్ల బరువు తగ్గడం కాదు పెరుగుతారు( Weight Gain ).ధూమపానం విసెరల్ కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది.ఈ విసెరల్ ఫ్యాట్ కాలేయం, ప్యాంక్రియాస్ మరియు ప్రేగులు వంటి ముఖ్యమైన అవయవాలను చుట్టు ముడుతుంది.
ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్‌తో సహా అనేక జబ్బులు తలెత్తుతాయి.అలాగే ధూమపానం విసెరల్ ఫ్యాట్( Visceral Fat ) పేరుకుపోవడాన్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, జీవక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగించి బరువు పెరుగుటను మరింత తీవ్రతరం చేస్తుంది.
ధూమపానం చేయడం వల్ల జీవక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది.దాంతో మీ శరీరంలో కేలరీలు కరిగే వేగం తగ్గి కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి.

ఫలితంగా మీరు భారీగా వెయిట్ గెయిన్ అవుతారు.కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే ధూమపానం వ్యసనాన్ని వదులుకోండి.స్మోకింగ్ మానేయడం వల్ల మీరు బరువు పెరిగే ప్రమాదం తగ్గడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.జీవితకాలం పెరుగుతుంది.క్యాన్సర్( Cancer ) రిస్క్ తగ్గుతుంది.గుండె జబ్బులకు సైతం దూరంగా ఉంటారు.








