ప‌చ్చి అల్లం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?

అల్లం( ginger ) గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లో అల్లాన్ని విరివిగా ఉప‌యోగిస్తారు.

 Do You Know The Health Benefits Of Eating Raw Ginger? Raw Ginger, Raw Ginger Hea-TeluguStop.com

ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో అల్లం క‌చ్చితంగా ప‌డాల్సిందే.ఆహారం రుచిని పెంచ‌డంలో అల్లం చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.

అంతేనా ఆరోగ్యానికి కూడా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అందులోనూ ప‌చ్చి అల్లం తిన‌డం మ‌రింత ప్ర‌యోజ‌క‌రం.

అల్లాన్ని పచ్చిగా తినడం వల్ల ప్రత్యేకమైన లాభాలు పొందొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Benefitsraw, Raw Ginger, Ginger, Tips, Latest, Rawginger-Telugu Health

బ‌రువు త‌గ్గ‌డానికి ప‌చ్చి అల్లం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వ‌న్ టీ స్పూన్ అల్లం త‌రుము, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ ( Lemon juice )క‌లిపి తీసుకుంటే శ‌రీరంలో అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.అదే స‌మ‌యంలో అల్లం శరీరాన్ని డిటాక్స్ కూడా చేస్తుంది.అలాగే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి నివార‌ణ‌లో ప‌చ్చి అల్లం గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.పచ్చి అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

పచ్చి అల్లం ముక్కలు తినడం వల్ల అందులో ఉండే జింజెరోల్స్ జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయి.ఆకలి పెంచుతాయి.

గ్యాస్, కడుపు ఉబ్బరం ( Gas, bloating )మరియు అజీర్తి సమస్యలకు చెక్ పెడ‌తాయి.

Telugu Benefitsraw, Raw Ginger, Ginger, Tips, Latest, Rawginger-Telugu Health

గుండె ఆరోగ్యానికి అల్లం అండంగా నిల‌బ‌డుతుంది.ఉద‌యాన్నే ప‌చ్చి అల్లాన్ని తేనెతో క‌లిపి తీసుకుంటే గుండెకు రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి గుండెకు మేలైన మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.

ఫ‌లితంగా గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.ప‌చ్చి అల్లం తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారికి ఇది చాలా సహాయపడుతుంది.అంతేకాదండోయ్‌.

ప‌చ్చి అల్లం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లు ద‌రిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.అయితే ప‌చ్చి అల్లాన్ని అధిక పరిమాణంలో తీసుకోకూడ‌దు.

అలా చేస్తే జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.పచ్చి అల్లాన్ని మితంగా తింటేనే ఆరోగ్యానికి ప్రయోజనక‌రం గుర్తుంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube