వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

ఇటీవల రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.వయసు పైబడిన వారే కాదు చిన్న వయసులో కూడా ఎందరో తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.

 If You Follow This Remedy Once A Week, You Will Not Get White Hair! Hair Pack, W-TeluguStop.com

ఈ క్రమంలోనే తెల్ల జుట్టుతో బయటకు వెళ్లలేక కలర్స్ పై ఆధార పడుతున్నారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారానికి ఒక్కసారి పాటిస్తే తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి కూడా రాదు.అదే సమయంలో ఎన్నో అద్భుతమైన లాభాలు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్( Glass of water ) వేసుకోవాలి.

వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్( Neem powder ), వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla powder ) వేసుకుని బాగా కలుపుతూ నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను కూడా వేసి థిక్ స్ట్రక్చర్ వచ్చేంతవరకు ఉడికించాలి.

Telugu Black, Care, Care Tips, Fall, Pack, Remedy, Latest, Long, Thick, White-Te

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Black, Care, Care Tips, Fall, Pack, Remedy, Latest, Long, Thick, White-Te

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే వయసు పైబడిన సరే తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి కూడా రాదు.ఒక‌వేళ తెల్ల జుట్టు ఉన్నా న‌ల్ల‌గా మారుతుంది.అలాగే ఈ రెమెడీని వాడటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.చుండ్రు, స్కాల్ప్ ఇచ్చింగ్ వంటి సమస్యలు దూరం అవుతాయి.జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

కాబట్టి నల్లని ఒత్తైన ఆరోగ్యమైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube