దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ లోను వెడ్డింగ్ డే( Wedding Day ) అనేది చాలా చాలా స్పెషల్.అటువంటి రోజున అందంగా, ఎట్రాక్టివ్ గా కనిపించాలని కోరుకుని వారు ఉండరు.
ముఖ్యంగా పెళ్లి కూతుర్లు( Brides ) వెడ్డింగ్ సెట్ అయినప్పటి నుంచి స్కిన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు.స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందేందుకు తెగ ఆరాటపడుతుంటారు.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని ట్రై చేయడం ద్వారా మీ వివాహంలో మీరు మరింత అందంగా కనిపించడం ఖాయం.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు తులసి ఆకులు,( Tulsi Leaves ) మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ తులసి జ్యూస్ లో చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయడం వల్ల చర్మంపై ముదురు రంగు మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
మొటిమలు సమస్య దూరం అవుతుంది.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.అలాగే ఈ రెమెడీ స్కిన్ టాన్ ను తొలగిస్తుంది.చర్మాన్ని అందంగా మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.
స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేయడంలో ఈ రెమెడీ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.