ఐఏఎస్( IAS ) కావడం దేశంలోని లక్షల మంది కల కాగా ఆ కలను నెరవేర్చుకున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే ఒక యువతి మాత్రం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఐఏఎస్ అయ్యారు.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ యువతి కన్నీటి కష్టాలు తెలిస్తే మాత్రం హ్యాట్సాఫ్ అనక తప్పదు.ఎన్నో కష్టాలను అధిగమించి ఈ యువతి ఈ స్థాయికి చేరుకున్నారు.
సవితా ప్రధాన్( IAS Savitha Pradhan ) ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, చంబల్ కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.తన గతం గురించి ఈ ఐఏఎస్ అధికారిణి మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్ లోని( Madhya Pradesh ) ఆదివాసీ కుటుంబంలో జన్మించానని అన్నారు.
అమ్మానాన్నలకు నేను మూడో సంతానమని 75 రూపాయల స్కాలర్ షిప్ తో నేను చదువుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.
నాకంటే 11 సంవత్సరాల పెద్దవాడితో పెళ్లి చేశారని అత్తింట్లో నన్ను పనమ్మాయిగా ట్రీట్ చేశారని ఆమె తెలిపారు.నవ్వకూడదని, టీవీ చూడకూడదని, తలపై చెంగు తీయకూడదని ఇంట్లో రూల్స్ అని భర్త రక్తం వచ్చేలా కొట్టేవాడని సవితా ప్రధాన్ అన్నారు.ఇద్దరు బిడ్డలు పుట్టాక కూడా పరిస్థితి మారలేదని ఆమె చెప్పుకొచ్చారు.
నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా ఎందుకిలా చేస్తున్నావని అడగలేదని సవిత అన్నారు.
ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి దొరికిన పనులు చేస్తూ బీఏ, ఎం.ఏ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశానని ఆమె తెలిపారు.యూపీఎస్సీ పరీక్షలపై( UPSC Exams ) దృష్టి 24 సంవత్సరాలకు మున్సిపల్ ఆఫీసర్ అయ్యానని సవిత పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసి భర్త నుంచి విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నా లైఫ్ ను పాఠాలుగా చెబుతూ మౌనంగా బాధలు భరిస్తున్న అమ్మాయిలకు ధైర్యం, తెగువ నూరిపోస్తున్నానని సవిత చెప్పుకొచ్చారు.
ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్ రూంలో తిన్న రోజులు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.