మూడంటే మూడే సినిమాలు చేసిన.. ఆనంద్ దేవరకొండ ఆస్తుల విలువెంతో తెలుసా?

Anand Devarakonda Property Details

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీతాగోవిందం సినిమాతో టాప్ హీరోగా మారాడు.

 Anand Devarakonda Property Details-TeluguStop.com

ప్రస్తుతం ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమా హీరోగా వచ్చాడు.ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆయన.గట్టి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.తాజాగా పుష్పక విమానం అనే సినిమా చేశాడు.

త్వరలో ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.ఈ సినిమా అయినా మంచి హిట్ కొడుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు.

 Anand Devarakonda Property Details-మూడంటే మూడే సినిమాలు చేసిన.. ఆనంద్ దేవరకొండ ఆస్తుల విలువెంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన సినిమా విషయాల గురించి కాసేపు పక్కన పెడితే.పర్సనల్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆనంద్ దేవరకొండ 1994 మార్చి 15న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జన్మించాడు.తండ్రి గోవర్ధన్ రావు, తల్లి మాధవి.ఆనందర్ ను నందు, చిన్నూ అని పిలుస్తారు.సికింద్రాబాద్ లిటిల్ ప్లవర్ స్కూల్ తో పాటు లయోలా కాలేజిలో చదివాడు.

ఆ తర్వాత ఫారిన్ లో కొంత కాలం ఉద్యోగం చేశాడు.వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాడు.

అయితే హైదరాబాద్ కు వచ్చినప్పుడు తన అన్నతో కలిసి షూటింగ్స్ దగ్గరికి వెళ్లేవాడు.అలా సినిమాల్లోకి రావాలనే కోరిక కలిగింది.

అందులో భాగంగానే 2019లో దొరసాని సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.తొలి సినిమా అంతంత మాత్రంగానే ఆడింది.

ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ చేశాడు.ఈ సినిమాతో మంచి పేరే వచ్చింది.

Telugu Arjun Reddy, Gita Govindam, Govardhan Rao, Madhavi, Pelli Chupulu, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుతం తను మూడో సినామ చేస్తున్నాడు.సినిమా పేరు పుష్పక విమానం.దామోదర దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే తన తొలి సినిమాకు 40 లక్షలు తీసుకున్నాడు.రెండో సినిమాకు 50 లక్షలు అందుకున్నాడు.ఇక తాజా మూవీకి 70 లక్షలు తీసుకుంటున్నాడు.అటు ఆనంద్ కు ఇంకా పెళ్లి కాలేదు.ప్రస్తుతం తన దగ్గర రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి.చెస్ అంటే తనకు చాలా ఇష్టం.మహేష్ బాబుతో పాటు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం.

పారిస్ తో పాటు మాల్దీవులు చాలా నచ్చే ప్రదేశాలు.ఫిలింనగర్ లో చాలా విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు.ఆయన నెట్ వర్త్ రూ.50 కోట్లు.

#Govardhan Rao #Madhavi #Arjun Reddy #Gita Govindam #Pelli Chupulu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube