చిన్న పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..!

చూడడానికి చిన్నపిల్లలు ( Children ) ఎంతో ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ఉంటారు.వారి కొన్ని అలవాట్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి.

ఎందుకంటే చిన్న పిల్లలు ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో ఉంటారు.అలాగే కొంతమంది పిల్లలలో కొన్ని భయపెట్టే అలవాట్లు కూడా ఉంటాయి.

అప్పుడప్పుడు మీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు మాట్లాడడాన్ని( Sleep Talking ) చాలామంది తల్లిదండ్రులు గమనించే ఉంటారు.నిద్రలోనే ఎవరికో కబుర్లు చెబుతున్నట్లు మాట్లాడుతూ ఉంటారు.

కొన్నిసార్లు పిల్లలు నిద్రలో అరవడం, భయపడడం కూడా చేస్తూ ఉంటారు.మీ పిల్లలు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఇలా చేస్తుంటే కచ్చితంగా ఈ అలవాటు మిమ్మల్ని ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

ఎందుకంటే పిల్లలలో ఈ అలవాటు సాధారణమైనదా లేదా ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకు ఉన్న ప్రతి అలవాటును తల్లిదండ్రులు ( Parents ) గమనిస్తూ ఉంటారు.కొన్నిసార్లు కొన్ని అలవాట్లు వారి ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతాయి.మూడు నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కొంతమంది పిల్లలు నిద్రలో మాట్లాడుతారు.కొందరు నవ్వుతారు.

మరికొందరు కోపంగా ఉంటారు.ఇలా నిద్రలో మాట్లాడే అలవాటు ఆడపిల్లల కంటే మగపిల్లలలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయితే వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య దూరం అయిపోతుంది.పిల్లలు చిన్నతనంలో నిద్రలో మాట్లాడడం సహజమే.

Advertisement

ఇదేమి తీవ్రమైన సమస్య కాదు.

ముఖ్యంగా చెప్పాలంటే మీ పిల్లల నిద్రపై దృష్టి పెట్టండి.సమయానికి నిద్రపోవడం అలవాటు చేయండి.వారు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

నిద్రపోయే సమయంలో మొబైల్ చూడడం, వీడియో గేమ్ ఆడకుండా చూసుకోవడం ఎంతో మంచిది.అలాగే హర్రర్స్ సినిమాలను( Horror Movies ) అస్సలు చూడకుండా జాగ్రత్త పడాలి.

రాత్రి సమయంలో తీపి పదార్థాలను( Sweet Food ) తినిపించకూడదు.పిల్లల దినచర్యలో కొన్ని వ్యాయామాలను చేర్చాలి.

అంతేకాకుండా పిల్లలు తరచుగా కోపంతో ఏదైనా మాట్లాడుతుంటే ఉదయాన్నే మీరు ఆ విషయం గురించి వారిని అడిగి సమస్యలను తెలుసుకోవడం మంచిది.ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మీ పిల్లలు నిద్రలో మాట్లాడకుండా ప్రశాంతంగా నిద్రపోతారు.

తాజా వార్తలు