దోషాలు తొలగిపోవాలంటే పాదరస శివలింగం పూజ తప్పనిసరి!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున పరమశివుడుకి పూజలు నిర్వహిస్తారు.పరమశివుడు మనకు విగ్రహరూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు.

 Mercury Shivalinga, Pooja, Hindu Tradition, Shiva Linga Pooja, Ragi-TeluguStop.com

శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం శివుడు విగ్రహ రూపంలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు.

కానీ భృగు మహర్షి శాపం వల్ల శివుడు విగ్రహ రూపంలో కాకుండా లింగరూపంలో దర్శనం కల్పిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో పాల రాయితో తయారు చేసిన శివలింగం,ఇత్తడితో, రాతితో, వజ్రంతో, బంగారంతో, మట్టితో చేసిన శివలింగానికి పూజలు నిర్వహించడం చూస్తుంటాము.

కానీ పాదరసంతో తయారు చేసిన శివలింగం కూడా ఉంటుందని, ఈ శివలింగం ఎంతో ప్రత్యేకతలు కలిగి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మరి పాదరస శివ లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పాదరసంతో తయారు చేసిన శివలింగాన్నిఏఅసరాజుఅనే పేరుతో పిలుస్తారు.పూర్వకాలం వచ్చే పాదరస శివలింగానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.పూర్వకాలంలోనే పాదరసంతో తయారు చేసిన దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని ఎంతో పవిత్రంగా పూజించే వారు.ఈ విధంగా పాదరస విగ్రహాలను పెట్టుకుని పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.

అయితే పాదరసంతో తయారు చేసిన శివలింగానికి పూజ చేయటం వల్ల అన్ని రకాల దోషాల నుంచి విముక్తి పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ప్రతిరోజు పాదరస శివ లింగానికి అభిషేకం చేసిన నీటిని తాగించడం వల్ల వారు వెంటనే కోలుకుంటారు.అదేవిధంగా ఇంట్లో పెళ్లీడుకొచ్చిన వారికి ఎన్ని సంబంధాలు చూస్తున్న వివాహ ప్రయత్నాలు విఫలమవడంతో అలాంటివారు పాదరస శివలింగారాధన చేయటం వల్ల 21 రోజులలో వారికి వివాహం నిశ్చయమవుతుంది.అదేవిధంగా పితృ దోషాలు ఉన్న వారు పాదరస శివలింగానికి పూజ చేయడం వల్ల పితృ దోషాలు నుంచి విముక్తి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు తెలియ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube