ఒక్కోసారి సడెన్‌గా ఏదైనా పార్టీకో, పంక్షన్కో వెళ్లాల్సి ఉంటుంది.బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకునే సమయం కూడా ఉండదు.
దాంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం ఎలానో తెలియక తెగ హైరానా పడిపోతూ ఉంటారు.అయితే ఇకపై అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఒక సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ ఫేషియల్ స్క్రబ్‌ను ట్రై చేస్తే క్షణాల్లో ముఖం గ్లోయింగ్‌గా మరియు ఎట్రాక్టివ్‌గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేషియల్ స్క్రబ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను వేసి పొడి చేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్‌ను తీసుకుని స్లైట్‌గా క్రష్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి, వన్ టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న బ్రౌన్ షుగర్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, రెండు చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు చక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వారకు మిక్స్ చేసుకుంటే స్క్రబ్ సిద్ధమైనట్టే.
దీనిని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకోవాలి.

ఆపై రెండంటే రెండు నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.వెంటనే వేళ్లతో మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుని నార్మల్ వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు మొత్తం తొలగిపోతాయి.
ముఖం కాంతివంతంగా మరియు మృదువుగా మెరుస్తుంది.కాబట్టి, ఇకపై హడావుడిగా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫేషియల్ స్క్రబ్‌ను ట్రై చేయండి.