మీ పిల్లలకు ఈ లడ్డూను రోజుకొకటి ఇచ్చారంటే వారి మెదడు ట్రైన్ కంటే వేగంగా పనిచేస్తుంది!!

తమ పిల్లలు( children ) ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.అయితే పిల్లల శారీరక ఎదుగుదల పైనే కాదు మానసిక ఎదుగుదలపై కూడా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.

 This Laddu Sharpens The Brain Of Children-TeluguStop.com

ముఖ్యంగా పిల్లల బ్రెయిన్ షార్ప్ గా మారడానికి కచ్చితంగా వారి డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ ను చేర్చాల్సి ఉంటుంది.అటువంటి సూపర్ ఫుడ్స్ లో ఇప్పుడు చెప్పబోయే హెల్తీ అండ్ టేస్టీ లడ్డూ కూడా ఒకటి.

మీ పిల్లలకు ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున ఇచ్చారంటే వారి మెదడు ట్రైన్ కంటే వేగంగా పనిచేస్తుంది.అదే సమయంలో మరెన్నో ఆరోగ్యం లాభాలను సైతం పొందుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Brain, Tips, Healthy Laddu, Laddu, Latest, Laddusharpens-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు రోల్డ్ ఓట్స్( Rolled oats ) వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్( Wall nuts ), ఒక కప్పు ఎండు కొబ్బరి ( Dry coconut )విడివిడిగా వేయించుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న రోల్డ్ ఓట్స్, వాల్ నట్స్ ఎండు కొబ్బరి, వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, పది వరకు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Brain, Tips, Healthy Laddu, Laddu, Latest, Laddusharpens-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున పిల్లల చేత తినిపించారంటే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.ముఖ్యంగా ఈ లడ్డూలో‌ ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, జింక్, ఫోలేట్, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు పిల్లల మానసిక ఎదుగుదలను మెరుగుపరుస్తాయి.మెదడును షార్ప్ గా మారుస్తాయి.

మరియు జ్ఞాపకశక్తిని, ఆలోచన శక్తిని మెరుగు పరుస్తాయి.మెదడు అభివృద్ధికి ఈ లడ్డూ ఎంతగానో తోడ్పడుతుంది.

అంతే కాకుండా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలను ఈ లడ్డూ చేకూరుస్తుంది.గట్ మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

శరీర బ‌రుగును నియంత్రణలో సైతం ఉంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube