వేసవిలో ఈ ఫుడ్ తినండి.. ఏ వ్యాధులూ దరి చేరవు

Eat This Food In Summer No Diseases Will Get There ,Eat This Food , Health Care, Summer Care, Coconut Water,health Tips, Mint,summer,Cucumbers, Watermelon,heart Attack

ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.

 Eat This Food In Summer No Diseases Will Get There ,eat This Food , Health Care,-TeluguStop.com

ఈ వేసవి కాలం వచ్చిదంటేనే చాలా మంది భయపడతారు.ఎండలకు ఎక్కడ స్పృహ తప్పుతామో అనే భయం ఉంటుంది.

అంతేకాకుండా నీరసించిపోవడం, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు ఉంటాయి.ఇక ఇవే కాకుండా కొన్ని వ్యాధులు చుట్టుముడతాయి.

ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.

వేసవిలో పుచ్చకాయ( watermelon ) తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.ఇందులో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది, ఇది మీ శరీరంలో రక్తాన్ని తరలించడంలో సహాయపడుతుంది.మీ రక్తపోటును తగ్గిస్తుంది.

దీనిలోని లైకోపీన్ గుండెపోటు ( heart attack )ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు చర్మ సంరక్షణకు సాయపడుతుంది.

దోసకాయల( Cucumbers ) వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి.దోసకాయల్లో ఉండే నీరంతా మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.దీనిలోని విటమిన్ K మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ ఎ దృష్టి లోపాలను నివారిస్తుంది.ఇక కొబ్బరి నీటి( coconut water )లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.ఫలితంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఇది సాయపడుతుంది.తరచూ ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే వేసవిలో చాలా లాభం ఉంటుంది.దీని వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దురద వంటివి రావు.అంతేకాకుండా ఏదైనా చల్లని పానీయాల్లో దీన్ని చేర్చుకుంటే శరీరానికి చల్లదనాన్ని అందించి, తాజా అనుభూతిని అందిస్తుంది.

పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి.ఇవి జీర్ణ సమస్యలను తొలగిస్తాయి.

అంతేకాకుండా శరీరానికి వేసవిలో చల్లదనాన్ని అందిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube