స‌మ్మ‌ర్‌లో చ‌ర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే బెస్ట్ ఫేస్ మాస్క్ ఇదే!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.భానుడు భ‌గ‌భ‌గ‌మంటూ ప్ర‌జ‌లపై నిప్పులు చెరుగుతున్నారు.

 This Is The Best Face Mask To Keep Your Skin Hydrated In Summer! Face Mask, Summ-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో ఎండ‌లు, వ‌డ గాల్పుల కార‌ణంగా చ‌ర్మం డ్రైగా మ‌రియు నిర్జీవంగా మారిపోతుంది.దాంతో ముఖం క‌ల త‌ప్పిన‌ట్టు క‌నిపిస్తుంది.

ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల క్రీములను వాడుతుంటారు.వాటితో ఫ‌లితం లేకుంటే ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ పాటిస్తుంటారు.

ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా.? అయితే ఇక‌పై చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఫేస్ మాస్క్‌ను ట్రై చేస్తే చ‌ర్మం హైడ్రేటెడ్‌గా మరియు గ్లోయింగ్‌గా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఫేస్ మాస్క్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక గ్రీన్ యాపిల్‌, ఒక కీర తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను బ్లెండ‌ర్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల‌ గ్రీన్ యాపిల్-కీర జ్యూస్‌ను వేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల <ప్యూర్ అలోవెర జెల్, వ‌న్ టేబుల్ స్పూన్ కోక‌న‌ట్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఫేస్ మాస్క్ సిద్ధ‌మైన‌ట్టే.

దీనిని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి, కావాలి అనుకుంటే మెడ‌కు అప్లై చేసి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

Telugu Tips, Face, Skin, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health Tips

అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో మాస్క్‌ను తొల‌గించి.త‌డిలేకుండా ట‌వ‌ల్‌తో తుడిచి ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా విటమిన్ సి సీర‌మ్‌ను అప్లై చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చ‌ర్మం హైడ్రేటెడ్‌గా మరియు గ్లోయింగ్‌గా మెరుస్తుంది.

స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మ‌రియు ముఖంపై ఏమైనా మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube