ఔషధాల గని తులసి.. నిత్యం ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ నుంచి స్ట్రెస్ రిలీఫ్ వరకు అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు( Basil Leaves ) ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా వివరించే చెప్పక్కర్లేదు.తుల‌సి మొక్క‌ను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

 Having Basil Leaves Daily Will Get So Many Health Benefits Details, Basil Leaves-TeluguStop.com

రోజు తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగిస్తారు.అలాగే తులసిని ఔషధ గని అని కూడా పిలుస్తారు.

తులసిలో అనేక ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందువ‌ల్ల‌ తులసి ఆకులను అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు నిరోధించడానికి విరివిరిగా ఉపయోగిస్తారు.

ఐదు తులసి ఆకులను ఒక గ్లాస్ వాటర్ లో నైట్ అంతా నానబెట్టి మరుసటి రోజు పది నిమిషాల పాటు మంటపై మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

తులసి వాటర్ ను( Basil Leaves Water ) రోజు ఉదయం తీసుకోవడం వల్ల అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా తులసి శరీరంలో కొవ్వును( Body Fat ) కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది.అలాగే తులసిలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉంటాయి.

తులసి వాటర్ ను తాగితే స్ట్రెస్ నుంచి క్షణాల్లో రిలీఫ్‌ పొందుతారు.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

Telugu Basil, Basil Benefits, Tips, Latest, Tulsi-Telugu Health

తులసి ఒక గొప్ప డిటాక్స్ ఏజెంట్ గా( Detox Agent ) కూడా ప‌ని చేసింది.తులసి ఆకులను వేసి మరిగించిన వాటర్ ను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.కిడ్నీలో రాళ్లు( Kidney Stones ) ఉంటే కరుగుతాయి.మధుమేహాన్ని నియంత్రించే స‌త్తా తులసికి ఉంది.రోజు ఉదయం తడిసి వాటర్ ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.

Telugu Basil, Basil Benefits, Tips, Latest, Tulsi-Telugu Health

తులసిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.అందువ‌ల్ల రోజుకు రెండు తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటే నోటిలోని బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ నాశ‌నం అవుతాయి.అంతేకాదు తుల‌సి వాట‌ర్ ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.సీజ‌నల్ వ్యాధుల‌తో పోరాడే సామార్థ్యం ల‌భిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube