వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన సీజనల్ పండ్లు ఇవే..!

జూన్ నెల(June Month) ప్రారంభం నుంచే వర్షాకాలం మొదలవుతుంది.ఇక ఈ వర్షాలు మెల్లమెల్లగా పెరిగి వాతావరణంలోని వేడి తాపాన్ని తగ్గిస్తాయి.

 These Are The Seasonal Fruits That Must Be Eaten During The Rainy Season Details-TeluguStop.com

ముఖ్యంగా వర్షాకాలం(Rain) వ్యాధుల కాలమని పెద్దవారు చెబుతూ ఉంటారు.కాబట్టి ఇలాంటి సమయంలోనే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

ఇక ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది.దానివల్ల జలుబు, దగ్గు, జ్వరాలు (Cough,Fever,Cold)వస్తాయి.

అందుకే ఈ సీజన్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

Telugu Blackberry, Bloodpressure, Tips, Orange, Sugarlevels-Telugu Health

ముఖ్యంగా ఈ సీజన్లో మన ఆరోగ్యానికి అండగా నిలిచి కొన్ని పండ్లు తీసుకుంటూ ఉండాలి.ఇవి తరుచుగా వర్షాకాలంలోనే లభిస్తాయి.కాబట్టి వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరిగి వర్షకాలంలో వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చు.అలాంటి వాటిలో నల్ల నేరేడు ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు.దీనినే బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు.వర్షాకాలంలో విరివిగా లభిస్తాయి.

విటమిన్ సి తో పాటు శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.నల్ల నేరేడు పండ్లను తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటుంది.

ఈ సీజన్ లో లభించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి.

Telugu Blackberry, Bloodpressure, Tips, Orange, Sugarlevels-Telugu Health

ఇక ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా చాలా అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు దాన్ని మనం తీసుకోవాలి.అయితే రక్తహీనత బారిన పడకుండా ఉండాలి.అయితే దానిమ్మ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

ఈ పండ్లతో పాటు ప్రతిరోజు ఒక ఆరెంజ్ ను తినాలని వైద్యులు చెబుతున్నారు.ఇందులో రోగనిరోధక వ్యవస్థను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది.ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా దూరం అవుతుంది.

ఇంకా చెప్పాలంటే చర్మం కూడా నిగారింపుగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube