Jesus Christ : ఏసుక్రీస్తు శిలువలో పలికిన అతి ముఖ్యమైన మాటలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే ను( Good Friday ) మార్చి 28వ తేదీన జరుపుకోనున్నారు.గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులంతా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.

 Jesus Christ : ఏసుక్రీస్తు శిలువలో పలి-TeluguStop.com

ఏసుక్రీస్తు( Jesus Christ ) వారు శిలువ మీద పలికిన మాటలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటారు.

అలాగే తమని పాపాల నుంచి రక్షించడం కోసం యేసు క్రీస్తు అనుభవించిన బాధను తలుచుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే శరీరం మొత్తం మాంసం ముద్దగా మారి రక్తం ధారలై ప్రవహిస్తున్న ఏసుక్రీస్తు తన గురించి కాకుండా తనని హింసించిన వారి కోసం శిలువ మీద ఉండి ప్రార్థించారు.

Telugu Christians, Friday, Jesus Christ, John, Mariam-Latest News - Telugu

తన శత్రువులను విడిచిపెట్టమని తండ్రిని కోరుకున్నారు.అలాగే ఏసుక్రీస్తుని శిలువ వేసినప్పుడు ఆయనకు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున మరో దొంగని కూడా శిలువ వేస్తారు.అయితే అందులో ఎడమవైపు ఉన్న దొంగను నువ్వు ప్రభువు బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా.నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని మాట్లాడుతాడు.అయితే కుడివైపు ఉన్న దొంగ మాత్రం ఏసుక్రీస్తు మహిమను( Jesus Christ Glory ) గ్రహించి నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు.ఆ సమయంలో ఏసుక్రీస్తు వారు ఆ దొంగకి పాపక్షమాపణ కలిగిస్తూ నేడు నీవు నాతో కూడా పరదైశులో ఉంటావని చెప్పారు.

అలాగే ఏసుక్రీస్తు 12 మంది శిష్యులలో యోహాను ఒకరు.నిత్యం యేసును వెంబడిస్తూ వాక్యానుసారం జీవించాడు.

Telugu Christians, Friday, Jesus Christ, John, Mariam-Latest News - Telugu

తను చనిపోయిన తర్వాత తన తల్లి బాధ్యతలు తీసుకోవాల్సిందిగా యోహానుకి అప్పగించారు.యేసు బిగ్గర శబ్దంతో ఏలోయి ఏలోయి లామా సభక్తామి అని అరిచారు.అంటే ఆ మాటలకు అర్దం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం.అలాగే ఆ సమయంలో ఏసుక్రీస్తు దగ్గరగా కేక వేస్తూ విజయవంతం తో సమాప్తం అయినది అని అన్నారు.

తను ఈ లోకానికి వచ్చిన పని అయిపోయిందని చెబుతూ తలవంచారు.అప్పుడు సమయం మూడు గంటలు.ఆ సమయంలో లోకమంతా చీకటి అలుముకుంది.మొత్తం నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయింది.

మరియమ్మ తన కుమారుడిని తలుచుకుని రోదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube