జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.గ్రహాల గమనం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రాశి చక్రంలోని గ్రహాల మార్పులు అన్ని రాశులపై శుభ లేదా అ శుభప్రభవాలను చూపుతాయి.ఇలా జరగడం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది.
మరికొందరికి ఇబ్బందులు వస్తాయి.
ఫిబ్రవరి 27న బుధ గ్రహం తమ సొంత రాశి అయినా కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది.జాతకంలో బుధుడు శుభప్రదంగా ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది.
కొన్ని రాశుల వారికి మార్చి నెలలో అద్భుతంగా ఉంటుంది.ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సంబంధం లో మాధుర్యం పెరుగుతుంది.ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా వారికి శుభ ఫలితాలను పొందుతారు.మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

కర్కాటకం రాశి వారు డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు.సమాజంలో గౌరవం పెరుగుతుంది.మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా పెట్టవచ్చు.అది మీకు లాభదాయకంగా ఉంటుంది.లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది.

సింహ రాశి వారికి ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది.ఆఫీసులో అన్ని కలిసి వస్తాయి.మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.
డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు వస్తాయి.వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.
కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి వారు ఈ సమయంలో శత్రువుల పై విజయం సాధిస్తారు.ఆఫీసులో మీకు గౌరవం పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను పొందుతారు.