టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్లలో అదితీరావు హైదరీ( Aditirao Hydari ) ఒకరు కాగా సిద్దార్థ్( Siddharth ) తో పెళ్లి తర్వాత ఆమె మరింత సంతోషంగా ఉన్నారు.తన భర్త గురించి అదితీరావు హైదరీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన భర్త ఎంతో సరదా మనిషి అని ఆమె తెలిపారు.నాకు, నా ఫ్యామిలీకి సిద్దార్థ్ ఎంతో వాల్యూ ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
సిద్దార్థ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలివిడిగా ఉంటాడని కలిసి ఉండటం తనకు బాగా నచ్చుతుందని ఆమె అన్నారు.ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు ఆ లక్షణం ఎంతగానో నచ్చిందని అదితీరావు హైదరీ కామెంట్లు చేశారు.
సిద్దార్థ్ పర్సనల్ గా చాలా సరదా మనిషి అని చుట్టూ ఉన్నవాళ్లను సంతోషంగా ఉంచాలని అనుకుంటాడని ఆమె చెప్పుకొచ్చారు.

సిద్దార్థ్ తో పెళ్లి ప్రస్తావన వచ్చిన సమయంలో నేను ఒక్క నిమిషం కూడా అలోచించలేదని వెంటనే ఓకే చెప్పేశానని అదితీరావు హైదరీ పేర్కొన్నారు.సిదార్థ్ అద్భుతంగా పాడతారని డ్యాన్స్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.నా దృష్టిలో సిద్దార్థ్ గొప్ప నటుడని ఆమె తెలిపారు.
మహా సముద్రం( Maha Samudram ) సినిమా సమయంలో సిద్దార్థ్, అదితీరావు హైదరీ ప్రేమలో పడ్డారనే సంగతి తెలిసిందే.

సిద్దార్థ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.సిద్ధార్థ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సరైన ప్రాజెక్ట్ లతో ముందుకొస్తే సిద్దార్థ్ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.
సిద్దార్థ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.అదితీరావు హైదరీ ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గతేడాది సెప్టెంబర్ లో సిదార్థ్ అదితి మ్యారేజ్ జరిగింది.సిద్దార్థ్ అదితి సంతోషంగా ఉంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.