సాధారణంగా మనం ఏదైనా పూజ సమయంలో స్వామివారికి పూజ చేసి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ప్రస్తుత కాలంలో స్వామివారికి నైవేద్యంగా వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులలో లేదా గాజు వస్తువులలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తాము.
కానీ పూర్వకాలంలో ఏ ఇంట్లో చూసినా మనకు రాగి, ఇత్తడి వంటి వస్తువులను ఉపయోగించే వారు కనుక స్వామివారికి నైవేద్యం కూడా ఇలాంటి వస్తువులలోనే సమర్పించేవారు.ఈ క్రమంలోనే త్రిమూర్తులలో ఒకరైన మహా విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టడం వల్ల ప్రీతికరం చెందుతారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యాన్ని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యాన్ని పెట్టడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతాడని చెప్పవచ్చు.
కేవలం రాగిపాత్రలో పెట్టడం వల్ల స్వామివారు ఎందుకంత ఇష్టంగా స్వీకరిస్తారనే విషయానికి వస్తే.పూర్వం మహా విష్ణువు కోసం గూడాకేశుడు అనే రాక్షసుడు విష్ణు కోసం ఘోర తపస్సు చేసాడు.
ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత విష్ణుదేవుడు గూడాకేశుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవగానే విష్ణుమూర్తి ఏదైనా కోరిక కోరమని చెప్పగా అందుకు గూడాకేశుడు వేల జన్మలపాటు విష్ణుభక్తి తనపై ఉండే విధంగా వరం ప్రసాదించాలని అడిగాడు.అలాగే తన సుదర్శన చక్రంతో తన శరీరాన్ని ఖండించాలని, అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని గూడాకేశుడు కోరడంతో విష్ణుమూర్తి అతని కోరికను నెరవేర్చాడు.

ఈ క్రమంలోనే విష్ణుమూర్తి వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు తన సుదర్శన చక్రంతో గూడాకేశుడు శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు.తన శరీరం నుంచి రాగిలోహం తయారయింది.ఈ విధంగా తయారైన రాగి లోహంలో విష్ణుమూర్తి నైవేద్యాన్ని స్వీకరించాడు.ఇక అప్పటి నుంచి విష్ణుమూర్తి భక్తులు కేవలం రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే స్వీకరించేవారు.విష్ణుమూర్తికి రాగిపాత్రలో పెట్టిన మెతుకులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఆ నైవేద్యం సమర్పించిన భక్తులు తన లోకంలో ఉంటారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తెలియజేశాడు.ఈ విధంగా అప్పటి నుంచి మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యాన్ని పెట్టడం ఆచారంగా వస్తోంది.
ఈ విధంగా రాగి పాత్రలో నైవేద్యం పెట్టడం వల్ల స్వామివారు ప్రీతి చెందుతాడని చెప్పవచ్చు.