ఈ జన్మలో పాపాలు ( Sins ) చేస్తే వచ్చే జన్మలో కచ్చితంగా అనుభవించాల్సిందే అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంకా పేదవాడిగా, దిక్కులేని వాడిగా పుడతారని కూడా చెబుతూ ఉంటారు.
కాబట్టి వీలైనంత వరకు మంచి పనులే చేయాలి.మంచి జరగాలని కోరుకోవాలి అని చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఎలాంటి పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం.ఇవన్నీ జరుగుతాయా బ్రదర్ అని అంటే ఏమో నిప్పు లేనిదే పొగ రాదు అని సామెత ఊరికే చెప్పలేదు కదా.ఏ మాత్రం నిజం లేకుండా ఇంత బలంగా ఎవరూ నమ్మరు.
ఎవరు అయితే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళని నరక లోకంలో బాగా శిక్షిస్తారు.ఆ తర్వాత వారు వచ్చే జన్మలో తోడేలుగా, ఆ తర్వాత రాబందువుగా, ఆ తర్వాత పాముగా, ఆ తర్వాత కొంగగా జన్మిస్తారని గరుడ పురాణంలో( Garuda Puranam ) ఉంది.ఇంకా చెప్పాలంటే పెద్ద వారిని గౌరవించని వారు వచ్చే జన్మలో కాకి గా పుడతారు.
అలా కాకిగా పదేళ్ల పాటు బ్రతుకుతారు.ఇంకా చెప్పాలంటే బంగారాన్ని( Gold ) దొంగతనం చేస్తే వ్యాస మహర్షి చెప్పినట్లుగా వచ్చే జన్మలో కిరీటంగా జన్మిస్తారు.
అంతే కాకుండా ఒక వేళ వెండిని దొంగతనం చేస్తే పావురంగా పుడతారని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇతరుల వస్తువులను దొంగతనం చేస్తే వచ్చే జన్మలో చిలుకగా పుడతారు.అలా వారి జీవితం అంతా పంజరంలోనే ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులను, బలహీనులను చంపితే వచ్చే జన్మలో గాడిదగా పుడతారు.వాళ్ళు జీవితమంతా వారి యజమానికి సేవ చేస్తూ చాకిరి చేసుకుంటూ జీవిస్తారు.