దేవుడికి ప్రతీ సంవత్సరం పెళ్లి ఎందుకు చేస్తారు?

ప్రతీ వ్యక్తి జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు.పలు కారణాల వల్ల కొందరు రెండు, మూడు కూడా చేస్కుంటారు.

 What Is The Reason Behind Every Year We Condut God Marriage , Devotional , Kalya-TeluguStop.com

కానీ ఒక్క దేవుడికి మాత్రమే ప్రతీ ఏటా పెళ్లి చేస్తుంటాం.ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకొని మురిసిపోతుంటాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నా లేదా చూసినా అదే పదివేలని అకుంటూ ఉంటాం.అయితే అసలు దేవుడికి అలా ప్రతీ ఏటా పెళ్లి ఎందుకు చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఏటా ఏ తిథి నాడు వివాహం జరిగిందో అదే రోజు వచ్చే ఏటా మళ్లీ జరుపుకోవాలని గృహ్య సూత్రాల్లో ఉంది.కానీ ఈ నియమం కేవలం దేవతలకు మాత్రమే.

అయితే రాముడు పుట్టిన రోజు నాడే సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.ప్రకృతి, పురుషుడు కలిసి ఉంటారనే సత్యాన్ని తెలియజేయడం కోసం పుట్టిన నాడే పెళ్లి చేయాలనే ఆచారం పుట్టింది.

వారి జయంతుల నాడే వివాహ ఉత్సవాలు జరిపించాలని కామికాగమంలో ఉందని పెద్దలు చెబుతుంటారు.అందుకే మనం అనేక రకాల దేవుళ్లకు వారి జయంతుల నాడే కల్యాణోత్సవాలు జరిపిస్తుంటాం.

ముఖ్యంగా సీతా రాముల కల్యాణం,  ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలాగే వేంకటేశ్వర స్వామి కల్యాణాలు ఎక్కువగా చేస్తుంటాం.అయితే ఆ భగవంతుడికి ప్రతి ఏటా పెళ్లి చేయకపోయినా ఫర్వాలేదు.

కానీ చేస్తే నేరుగా మనం ఆ స్వామి, అమ్మవార్ల పెళ్లిని చూసినట్లు ఫీలవుతాం కాబట్టి… ప్రతి ఏటా ఆ దేవుడికి పెళ్లి క్రతువు నిర్వహిస్తుంటాం.

WHAT IS THE REASON BEHIND EVERY YEAR WE CONDUT GOD MARRIAGE

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube