సాధారణంగా ప్రతి ఒక్కరికి దీపారాధన చేసే సమయంలో ఎన్ని వత్తులు వేయాలనే విషయంలో సందేహం రావటం సహజమే.దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 2 వత్తులు లేదా 5 వత్తులు ఎన్నిఐన సరే దానికి సమాధానం 5 వత్తులు.ఉత్తమం అని పెద్దలు చెప్పుతూ ఉంటారు.
మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని , రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మ వృద్ధిలకూ,అయిదోవది వంశాభివృద్ధికి అని చెప్తారు.దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పని సరిగ్గా వుండాలనేది ఒక నియమం అని చెప్పవచ్చు.
అయితే చాలా మంది 5 వత్తులను వేసి దీపారాధన చేస్తూ ఉంటారు.