ఎన్నికలకు ముందు హుజూరాబాద్ లో ఆసక్తికర ఘటన

సాధారణంగా ఎవరైనా నేత పార్టీ మారినప్పుడు పార్టీ కండువా మారటం.ఎన్నికల గుర్తు మారటం సహాజం.

 An Interesting Incident In Huzurabad Before The Elections-TeluguStop.com

కానీ ఇక్కడ నేత పార్టీ మారడమే ఆలస్యం కార్యాలయం రంగు కూడా మారిపోయింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

నియోజకవర్గానికి చెందిన వొడితల ప్రణవ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇప్పటివరకు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయంగా ఉన్న తన సొంత భవనానికి కాంగ్రెస్ పార్టీ రంగులు వేయించారు.దీంతో మొన్నటివరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఆ భవనం కాస్తా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిపోయింది.

మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీకి కార్యాలయం లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube