ముఖం అద్దంలా అందంగా మరియు ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించేవారు ఎందరో ఉన్నారు.ముఖ్యంగా మగువలు అటువంటి ముఖ చర్మం కోసం తహతహలాడుతుంటారు.
మీరు ఈ లిస్టులో ఉన్నారా? అయితే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ క్రీమ్ ను మీరు వాడాల్సిందే.ఆ క్రీమ్ మీ ముఖాన్ని ఎల్లప్పుడూ అద్దంలా మెరిపిస్తుంది.
అలాగే రోజు వాడితే ఈ క్రీమ్ వల్ల ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ క్రీమ్( Magical cream ) ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), మూడు అనాస పువ్వులు( Anas flowers ), అరకప్పు డ్రై రోజ్ పెటల్స్ వేసి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్చటి వస్త్రం సహాయంతో ఉడికించుకున్న మిశ్రమం నుంచి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జెల్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, నాలుగు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్,( Rose essential oil ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.

ప్రతిరోజు ఈ క్రీమ్ ను వాడితే ముఖం అద్దంలా మెరిసిపోతుంది.ఉదయానికి ముఖం ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.
ముఖ చర్మం టైట్ గా మారుతుంది.పొడి చర్మం నుంచి విముక్తి లభిస్తుంది.
స్కిన్ కోమలంగా తయారవుతుంది.అంతేకాదు ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడితే డార్క్ స్పాట్స్ మాయం అవుతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతమవుతుంది.కాబట్టి అందమైన మెరిసే మృదువైన ముఖ చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.