రష్యాపై ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టిన అమెరికా.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నేటికీ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది.అయితే బలమైన ఆయుధ సంపత్తి ఉన్న రష్యా ( Russia ) ధాటికి ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది.

 Ukraine Wants More Powerful Weapons From America Details, Latest News, Telugu Nr-TeluguStop.com

తమ దేశంలోని కొన్ని భాగాలను రష్యా నుంచి స్వాధీనం చేసుకున్నామని సంబరం కొన్ని గంటలు కూడా నిలవడం లేదు.రష్యా తన వద్దనున్న సుఖోయ్ వంటి యుద్ధ విమానాల సాయంతో ఆకాశం నుంచి దాడులు చేస్తోంది.

ఉక్రెయిన్‌లోని ( Ukraine ) పలు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది.దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి( Zelensky ) ఏం చేయాలో పాలు పోవడం లేదు.

అయితే రష్యాపైకి ఉక్రెయిన్ దేశాన్ని ఎగదోసిన అమెరికా ( America ) మాత్రం చోద్యం చూస్తోంది.ఇలాంటి కష్ట కాలంలో ఉక్రెయిన్ కు సరైన సాయం అందించలేదు.

తమకు పాతకాలం నాటి యుద్ధ విమానాలను అమెరికా అందిస్తోందని, అయితే వాటితో రష్యాపై పోరాడలేకపోతున్నామని జెలెన్ స్కీ వాపోతున్నారు.పాత యుద్ధ విమానాలతో దాడి చేసే సమయంలో రష్యా తన అత్యాధునిక విమానాలతో విరుచుకుపడుతోందని ఉక్రెయిన్ వాపోతుంది.ఫలితంగా తమ దేశ భూభాగాలను, సైనికులను కోల్పోతున్నామని పేర్కొంది.ఇటీవలే రష్యా అధ్యకుడు పుతిన్ మరియుపోల్ నగరంలో పర్యటించారు.

అక్కడ రష్యన్ భాష మాట్లాడే వారితో ఆయన సంభాషించారు.

ఇలా తమ దేశంలో కీలక ప్రాంతాలను, భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంటుండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.తాము భూభాగంలో దళాలను పంపించి ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నామని, ఈలోపే గగనతలం నుంచి రష్యా యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రష్యాతో సమర్ధవంతంగా పోరాడాలంటే అమెరికా తమకు ఆధునిక యుద్ధ విమానాలను ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే ఉక్రెయిన్ వినతిని అమెరికా పట్టించుకుంటుందో లేదో తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube