పుణ్యక్షేత్రంలో బూజు పట్టిన లడ్డూల పంపిణీ.. భక్తుల తీవ్ర ఆగ్రహం.. ఎక్కడంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినా భద్రాచలం సీతారామ చంద్ర స్వామిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇక్కడి లడ్డూలకు మహాప్రసాదంగా భావించి మరి తీసుకొని వెళుతూ ఉంటారు.

 Fungus Found In Bhadrachalam Temple Laddu Prasadam Details, Fungus Laddoo, Bhadr-TeluguStop.com

వ్యాయా ప్రయాసలకు ఓర్చి క్యూ లైన్ లో నిలబడి లడ్డూలు కొనుగోలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా భక్తులకు ఎంతో ఇష్టమైన రాముడి ప్రసాదం నాణ్యత డొల్లగా మారిపోయిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం రామాలయంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డూలు బూజు పట్టడం కలకలాన్ని సృష్టిస్తుంది.ఇటీవల ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులకు అందించేందుకు సుమారు రెండు లక్షల లడ్డూల తయారు చేసినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.

అయితే భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డులను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.దీనివల్ల లడ్డూలకు ఫంగస్ బూజు పట్టినట్లు భక్తులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Fungus Laddoo, Fungus Laddu, Laddu Prasadam, Moldy La

అయితే వాటిని పక్కన పెట్టకుండా అలాగే లడ్డు కౌంటర్లో పెట్టి విక్రయిస్తున్నారు.దీని వల్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ బూజు పట్టిన లడ్డు ప్రసాదాలు విచ్చేస్తున్నారు అంటూ నోటీస్ గోడకు అంటించడం తీవ్ర కలకలం రేపింది.అంతేకాకుండా ఇలా తయారు చేసిన లడ్డూలను గాలికి ఆరబెట్టడం లేదా చల్లని ప్రదేశాలలో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంది.

Telugu Bhakti, Devotional, Fungus Laddoo, Fungus Laddu, Laddu Prasadam, Moldy La

ఇంకా చెప్పాలంటే దేవస్థానం అధికారులు ఇష్టానుసారం లడ్డూలను పెట్టడం కౌంటర్లలో వేడి వాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండడంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఏమాత్రం అంచనాలు లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో లడ్డులు తయారు చేయించడం స్టాక్ ఉంచడంతో అవి భూజు పట్టి వృధా అవుతున్నాయని భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భక్తుల ఆరోగ్యాలతో దేవస్థానం అధికారులు చెలగాటమాడుతున్నారని కూడా మరి కొంతమంది భక్తులు దేవస్థానం అధికారులపై విమర్శలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube