సాధారణంగా నిద్ర పోయే సమయంలో దాదాపు అందరికీ తప్పకుండా కలలు వస్తూ ఉంటాయి.కొన్ని కలలు తమ భయాలకు సంకేతాలు.
అయితే కొన్ని మనలోని ఆలోచనలకు సంబంధించినవి.వీటికి భిన్నంగా కొన్ని భవిష్యత్తు కోసం వచ్చే కలలు కావచ్చని స్వప్న శాస్త్రం( Dreams ) లో ఉంది.
అలాగే కొంతమందికి జీవిత భాగస్వామిని సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి.కోరుకున్న భాగస్వామి లేదా ఆశించిన లక్షణాలు కలిగిన వ్యక్తి తమ జీవిత భాగస్వామిగా వచ్చేటప్పుడు ఇలాంటి కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

మీకు కలలో అందమైన ఎంబ్రాయిడరీ ( Embroidery )చేసిన దుస్తులు కనిపిస్తే మీకు అందమైన భాగస్వామి లభిస్తాడని అర్థం చేసుకోవచ్చు.ఎవరైనా మీకు నగలు ఇచ్చినట్లు కల వస్తే ఆ నగలు ఇచ్చిన వ్యక్తికి త్వరలో ఒక సంపన్న కుటుంబంలో వివాహం అవుతుందని అర్థం చేసుకోవచ్చు.మీ కలలో జాతర జరుగుతున్నట్లు లేదా మీరు జాతర లో తిరుగుతున్నట్లు కనిపిస్తే త్వరలో మీకు తగిన జీవిత భాగ్యస్వామినీ పొందుతారని అర్థం చేసుకోవచ్చు.కలలో మీరు గడ్డం పెంచుకొని కనిపిస్తే మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే కలలో వజ్రం( diamond ) లేదా వజ్రాలు పొదిగిన అభరణాన్ని ధరించడం మీరు చూస్తే అది మంచి కాదు.ఈ కల మీ ఆనందమైన వైవాహిక జీవితానికి దిష్టి ఉందని చెబుతోంది.కలలో ఉంగరం ధరించడం లేదా ఉంగరం కనిపిస్తే త్వరలో చాలా ప్రేమించే భాగస్వామి మీకు లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు.కొత్త పాదరక్షలు కొంటున్నట్టు కల వస్తే త్వరలోనే మీరు కూడా జతకట్టు బోతున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే కలలో తల్లిదండ్రులు కలిసి కనిపిస్తే త్వరలో మీకు ఘనంగా వివాహం జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.రైలులో ప్రయాణం చేస్తున్నట్లు కలలు వస్తే అది మీకు కళ్యాణ ఘడియలు ప్రారంభమయ్యాయని చెప్పే సంకేతంగా భావించవచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది.