ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఎంతో ఆనందంగా సిరిసంపదలతో తమ జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు.తమ కుటుంబ సభ్యులతో అలాగే తమ స్నేహితులతో నిత్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు.
కానీ జీవితంలో బ్యాడ్ లక్( Bad luck ) పేదరికం దరిచేరకుండా, ధనవంతులుగా, ఆనందంగా ఉండాలంటే కొన్ని పనులు చేయకుండా ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు.నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో చేసే కొన్ని తప్పిదాల వల్ల బ్యాడ్ లక్ వెంటాడుతుంది అని నారద ప్రాణం చెబుతోంది.
అయితే ఇంట్లో తినే వస్తువులు నేల మీద పడితే వాటిని తొక్కడం చేయకూడదు.అలాగే తినే ప్లేట్ మీద అడుగు పెట్టడం కానీ చేస్తే దరిద్రం( poor ) కచ్చితంగా వెంటాడుతుంది.అవి పొరపాటున జరిగినప్పటికీ కూడా దరిద్రం కచ్చితంగా వెంటాడుతుంది.ఇక ఇంటిని శుభ్రం చేసే సమయంలో అలాగే ఇంటిని మాపింగ్ చేసినప్పుడు గాని ఆ మురికి నీళ్లు ( dirty water )మీ శరీరంపై పడకుండా చూసుకోవాలి.
అలా ఆ మురికి నీళ్లు శరీరంపై పడితే దరిద్ర దేవత వెంటాడుతుందట.అంతేకాకుండా స్మశానంలో దహన సంస్కారం చేస్తున్న సమయంలో వచ్చే పొగ పీల్చిన కూడా పేదరికం, దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే.
ఇక ఎవరైనా చనిపోయిన సమయంలో శవాన్ని ముట్టుకున్న లేదా ఆ శవాన్ని చూసి వచ్చి వెంటనే తల స్నానం చేయకపోయినా అంతులేని పేదరికం వెంటాడుతుంది.దహన సంస్కారానికి సిద్ధంగా ఉన్న కూడా అరిష్టాలు కలుగుతాయి.ఎందుకంటే చితిపై ప్రతికూల శక్తులు ఉంటాయి.అలా చితిపై ఉండే ప్రతికూల శక్తులకు తాకిన వ్యక్తులపై ప్రభావం చూపుతాయి.అలాగే చినిగిపోయిన చాపల మీద పడుకోవడం, రోలు తిరగబడడం, సంబంధం లేని వ్యక్తుల ఆస్తికలు తాకడం లాంటివి చేసినా కూడా దరిద్రం వెంటాడుతుంది.కాబట్టి ఈ పనులన్నీ చేయకుండా జాగ్రత్త పడితే మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు.
LATEST NEWS - TELUGU