మనకు తెలిసినంతవరకు సరదాలు, సరసాలు అంటే మొదట శ్రీకృష్ణుడే గుర్తుకివస్తాడు.ప్రేమకథలు ఆయనవే, మనకున్న పురణాల సంపదలో రొమాంటిక్ హీరో కూడా ఆయనే.
అందుకే కృష్ణుడిని మోహనుడు అని కూడా పిలిస్తారు.అంతటి సమ్మోహన శక్తి ఆయనకి ఉంది కాబట్టే 16 వేలమంది గోపికలు ఆయన చూపు పడితే చాలు అనుకున్నారు.
అన్నివేల మంది ఆయన భార్యలయ్యారు.మరి శ్రీకృష్ణుడు అందరు చూసినట్టుగా శృంగార స్వరూపుడా ? యోగి కాదు, భోగి అంటారా?
నిజానికైతే శ్రీకృష్ణుడి భోగిలాగా అనిపించే యోగి.అంతా అయనకి పదహారు వేలమంది భార్యలున్నారు అని మాట్లాడతారు కాని, అసలేం జరిగిందో, దాని వెనుక కథ ఏంటో తెలుసుకోరు.నరకాసురుడు భైరవ పూజ కోసం ప్రపంచం నలుమూలల నుంచి పదహారు వేలమంది కన్యలను తీసుకొచ్చి బంధిస్తాడు.
వారిని పాతాళంలో కొన్ని సంవత్సరాలు బంధిస్తారు.ఎప్పుడైతే కృష్ణభగవానుడు నరకాసురిడిని వధించి అతని కుమారుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడో, అప్పుడే ఆ కన్యలని విడిపించి, ఎవరి స్వస్థలాలకి వారిని వెళ్ళిపోమంటాడు.
కాని కృష్ణుడి వీరత్వానికి, ఉదారతకి పడిపోయిన కన్యలని కృష్షుడిని వదిలి వెళ్ళలేకపోతారు.తనతోనే ద్వారకలో ఉంటామని, వెళ్ళిపొమ్మంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు.
నిజానికి ఈ జన్మలో కృష్ణుడితో సహచర్యం, వారి పూర్వజన వరం.అందుకే కృష్ణుడి చెలిమి దక్కింది.అంతేతప్ప ఆయన భోగి కాదు.అందుకే, ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన నెమలి ఫించాన్ని ధరిస్తాడు.ఎందుకంటే ఆడ మగ సంభోగం చేసుకోని జీవి నెమలి.ఆడ నెమలి గర్భం దాల్చేది మగ నెమలి కన్నీటిబొట్టు తాగి.
అంత పవిత్రమైన అర్థం నెమలి ఫించంలో దాగుంది.అందుకే ఇది ముస్లిములు దర్గాల్లో కూడా కనిపిస్తుంది.