శుక్రవారం ఎన్నో శుభాలను కలిగించే రోజు.ఈ రోజున మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, నోములు చేస్తుంటారు.
ఇలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి అనుకున్న కార్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి.ఈ శుక్రవారానికి శుక్రుడు ఆదిదేవుడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు శుక్రవారాలు నియమిస్తాడు.
ఆనందం, సుఖసంతోషాలు, సంతృప్తి వీటికి శుక్రుడు మూలకారకుడు.
శుభసూచకాలుగా పిలువబడే పావురం, హంసలు శుక్రుడికి పవిత్రమైనవి.శుక్రునికి నీటితో అభిషేకం చేసిన తర్వాత, తెల్లని విభూతితో అభిషేకం చేయాలి.
శుక్రునికి తెలుపు రంగు ముఖ్యమైనది.శుక్రుని ధాన్యంగా పిలువబడే శెనగలను ఎర్రని వస్త్రంలో కట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవలెను.
ఇలా చేయడం ద్వారా బాధలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి.

శుక్ర గ్రహానికి, శుక్రవారానికి వృషభ, తులా రాశులు వారికి ముడిపడి ఉన్నాయి.వృషభ, తుల రాశి జాతకులకు శుక్రవారం అమితమైన అదృష్టాన్ని కలిగిస్తుంది.వీరు శుక్రవారం ఏ శుభకార్యం చేసినా లేదా ఏ పని మొదలు పెట్టినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
ఈ రాశి వారు శుక్రవారం రోజున శుక్రునికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
తుల, వృషభ రాశి వారు శుక్రవారం చేయవలసిన పనులు.
ఏదైనా శుభకార్యాలను ప్రారంభించడం, విదేశీ పర్యటనలు, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం ఇంకా గృహ, వాహనాలను కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు.అంతేకాకుండా ఇతరులకు సాయం చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుతారు.
శుక్రవారం పూజ సమయంలో శుక్రునికి లేదా అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రమును ధరించి, ఎరుపు రంగు పూలతో పూజ చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.అలాగే స్త్రీలు శుక్రవారం రోజున ఎరుపు రంగు పువ్వులను పెట్టుకోవడం మంచిది.
తుల, వృషభ రాశి వారు జాతి పచ్చ రంగు రత్నాలు, నీలి రంగు పొదిగి ఉన్న వజ్రపు ఉంగరాలు ధరించవలెను.వీటితో పాటు పచ్చ రంగు లేదా లేత ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.