విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ దివ్యాంగుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ దివ్యాంగులను చూస్తే మనస్సు కలిచివేసిందన్నారు.పిల్లలను రోడ్డుపై, పట్టాలపై వదిలేస్తున్నారన్న పవన్ కల్యాణ్ దివ్యాంగుల సర్టిఫికెట్ ఉన్నా కొందరికి న్యాయం జరగడం లేదని చెప్పారు.
దివ్యాంగుల చట్టం కూడా రాష్ట్రంలో అమలు కావడం లేదని విమర్శించారు.దివ్యాంగులను ఇబ్బంది పెట్టే వారిని శిక్షించే చట్టం రావాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు.సమాజంలో ఇలాంటి వారిని ఆదుకునే వారు ముందుకు రావాలన్న పవన్ ఎన్డీఏ మీటింగ్ కి వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.