స్టార్ హీరో నాగచైతన్యకు( hero Naga Chaitanya ) ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.తండేల్ సినిమాతో ( Tandel )నాగచైతన్య కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 90 కోట్ల రూపాయలు( 90 crore rupees ) అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా డిజిటల్ హక్కులు 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
మరోవైపు కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
నాగచైతన్య తండేల్ మూవీకి బన్నీ ఫ్యాన్స్ నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించే ఛాన్స్ ఉంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ ( Geetha Arts Banner )లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.తండేల్ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
తండేల్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
కథ, కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.తండేల్ సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుంది.తండేల్ సినిమా రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.
రియల్ లైఫ్ స్టోరీ( real life story ) ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కిందని తెలుస్తోంది.త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.నాగచైతన్య తర్వాత సినిమాలతో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.చైతన్య పారితోషికం 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.2025 సంవత్సరం అక్కినేని హీరోలకు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అక్కినేని హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.