మహాకుంభమేళా ( Mahakumbh Mela )విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర ఉత్సవం.ప్రతిసారి కోట్లాది భక్తులు ఈ మహా కార్యక్రమానికి హాజరవుతారు.
అయితే, ఈసారి కుంభమేళాలో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అరబ్ షేక్ ( Arab Sheikh )వేషధారణలో ఓ యువకుడు కుంభమేళాకు హాజరై అక్కడ హల్చల్ చేయడంతో, అక్కడున్న సాధువులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఇకపోతే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న యువకుడు అరబ్ షేక్‌లా తలపాగా ధరించి కుంభమేళాకు వచ్చాడు.
అతనితో పాటు మరో ఇద్దరు యువకులు బాడీగార్డుల్లా నటించారు.రీల్స్ కోసం అతని విచిత్ర ప్రవర్తన అక్కడి సాధువుల దృష్టిని ఆకర్షించింది.వీడియోలో కనిపించినట్లు, ఓ వ్యక్తి “మీకు ఎలా అనిపిస్తుంది?” అని ప్రశ్నించగా, యువకుడు “అంతా బాగానే ఉంది” అని సమాధానమిచ్చాడు.పేరు ఏమిటని అడగగా.యువకుడితో ఉన్న వ్యక్తులు “షేక్ ప్రేమానంద్”( Sheikh Premanand ) అని తెలిపారు.
రాజస్థాన్ ( Rajasthan )నుంచి వచ్చినట్లు తెలిపిన ఈ యువకుడి ( young man )ప్రవర్తన స్థానికులకూ, సాధువులకూ అనుమానం కలిగించింది.వారు యువకుడి తలపాగాను తొలగించి, అతడి అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.నకిలీ షేక్ అని తేలడంతో ఆగ్రహించిన సాధువులు యువకుడిని చితకబాదారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నకిలీ వేషధారణలో కుంభమేళాకు రావడం, హిందూ సంస్కృతిని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించడం పలువురు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.మహాకుంభమేళా వంటి పవిత్ర సందర్భంలో ఇలాంటి ప్రవర్తనను చూసిన సోషల్ మీడియా నెటిజన్లు అతడిపై మంది పడుతున్నారు.
మహాకుంభమేళా ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీక.అలాంటి పవిత్ర ఉత్సవంలో రీల్స్ కోసం నకిలీ వేషధారణలో వచ్చి, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను కఠినంగా వ్యతిరేకించాలి.