ఇటీవల కాలంలో చాలా మంది బరువు నియంత్రణకు మరియు ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ఓట్స్( Oats ) ను తమ రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకుంటున్నారు.అయితే ఓట్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని పెంచడంలో కూడా అద్భుతంగా సహాయపడతాయి.
ఓట్స్ న్యాచురల్ ఎక్స్‌ఫోలియేటర్ గా పని చేస్తాయి.అలాగే చర్మాన్ని తేమగా ఉంచడంలో, మృదువుగా మార్చడంలో తోడ్పడతాయి.
మెరిసే మృదువైన చర్మాన్ని కోరుకునేవారు ఇప్పుడు చెప్పబోయే ఓట్స్ ప్యాక్స్ ను తప్పక ట్రై చేయండి.
ప్యాక్ 1: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటే చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.చర్మంపై త్వరగా ముడతలు పడకుండా ఉంటాయి.

ప్యాక్ 2: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ( Tomato puree ), వన్ టీ స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై పదిహేను నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ ప్యాక్ టాన్ ను రిమూవ్ చేస్తుంది.చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగిస్తుంది.మెరిసే మృదువైన చర్మాన్ని మీసొంతం చేసుకుంది.

ప్యాక్ 3: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్, సరిపడా పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.పొడి చర్మంతో బాధపడుతున్న వారికి ఈ ప్యాక్ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.డ్రై అవ్వకుండా ఉంటుంది.స్కిన్ టైట్ అవుతుంది.
ప్రకాశవంతంగా కూడా మెరుస్తుంది.