రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య అధికంగా ఉండటం ఎంతో అవసరం.శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఈ ప్టేట్‌లెట్స్ ఉపయోగపడతాయి.
అయితే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్, పలు రకాల మందులు వాడకం, గుండె వ్యాధులు ఇలా రకరకాల కారణాల వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గి పోతాయి.దాంతో రక్తం గడ్డ కట్టడం ఆగిపోతుంది.
ఫలితంగా రక్తస్రావం ఎక్కువగా అయి మనుషులు వీక్‌గా మారిపోతాడు.ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదంగా కూడా మారుతుంది.
అందుకే ప్లెట్‌లెట్స్‌ను పెంచుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఆద్భుతంగా ఉపయోగపడతాయి.
మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండు ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
దానిమ్మలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే రెగ్యులర్‌గా ఒక దానిమ్మ పండ్లు తీసుకుంటే.
ప్లేట్‌లెట్స్ మాత్రమే కాదు ఎర్ర రక్త కణాలు కూడా సమర్థవంతంగా పెరుగుతాయి.
రక్తంలో ప్లేట్ లెట్స్ పెరిగేలా చేయడంలో వెల్లుల్లి కూడా గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
అందు వల్ల, రెగ్యులర్ డైట్‌లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి.

ఆకుకూరలకు కూడా ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచే శక్తి ఉంది.కాబట్టి, వారంలో కనీసం మూడు సార్లు ఆకుకూరలు తీసుకుంటే ప్లేట్‌లెట్స్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.
బొప్పాయి ఆకుల నుంచి రసం తీసుకుని తాగితే.
సూపర్ ఫాస్ట్‌గా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.బొప్పాయి ఆకులే కాదు బొప్పాయి పండు తిన్నా ప్లేట్‌లెట్స్ సూపర్‌గా పెరగుతాయి.
వీటితో పాటుగా బీట్ రూట్, క్యారెట్, ఎండు ద్రాక్ష, ఉసిరి, గుమ్మడి పండు, ఖర్జూరాలు, కలబంద రసం వంటివి తీసుకోవడం ద్వారా కూడా ప్లేట్‌లెట్స్‌ను పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.