సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాకు( Maha Kumbhamela ) వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు తన కుమారుడు అకీరా, తన మూడవ భార్య అన్నా లెజీనోవాతో కలిసి ఈయన కుంభమేళాకు వెళ్లి అక్కడ నది స్నానాలను ఆచరించడమే కాకుండా త్రివేణి సంగమకు హారతులు ఇస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఇలా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు వెళితే అంతా మంచే జరుగుతుందని పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది ఏపీ నుంచి కూడా సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా వెళ్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లడంతో ఆయన నదీ స్నానం చేస్తున్న సమయంలో తన మెడలో జంధ్యం ( Jandhyam )కనిపించింది.దీంతో పెద్ద ఎత్తున ఈ జంధ్యం పై చర్చలు జరుగుతున్నాయి సాధారణంగా బ్రాహ్మణులు లేదా వైశ్యులు ఇలా జంధ్యం ధరిస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ధరించారు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ విధంగా జంధ్యం ధరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయనే చెప్పాలి.పవన్ కళ్యాణ్ ఎక్కువగా దేవుడిని నమ్ముతుంటారు అందుకే పెద్ద ఎత్తున దీక్షలు హోమాలు నిర్వహిస్తూ ఉంటారు.ఇలా దీక్ష చేసే సమయంలో చాలామంది జంధ్యం ధరిస్తారు బహుశా పవన్ కళ్యాణ్ కూడా అలా ధరించి ఉండవచ్చని చెబుతున్నారు ఇటీవల ఈయన సనాతన ధర్మం టూర్ కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగానే వేద పండితులు ఆయనకు జంధ్యం వేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.అలాగే కాపులలో కూడా కొంతమంది జంధ్యం ధరిస్తారని తెలుస్తోంది.

కాపులు యజ్ఞోపవీతం జంధ్యం ధరిస్తారని కూడా ఒక ప్రచారం ఉంది.అలాగే జంధ్యం వేసుకోవడం వైదిక సాంప్రదాయం అని.బలిజల్లో క్షత్రియ బలిజలు జంధ్యం ధరిస్తారని కూడా కొందరు చెప్పుకొస్తున్నారు.మొత్తానికి పవన్ ఏ కారణం చేత ఈ జంద్యం వేసుకున్నారు అనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఈయన జంధ్యం గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.