సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి( Akkineni Family ) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో నాగచైతన్య, అఖిల్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.నాగచైతన్య కెరియర్ పరంగా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు ఆరు సినిమాల వరకు నటించిన ఈయనకు మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేకపోయింది.
ఇక చివరిగా ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పూర్తిగా నిరాశపరిచింది.

ఇక ప్రస్తుతం పలువురు దర్శకులతో అఖిల్ ( Akhil )తన సినిమా చర్చలు జరుపుతున్నారని ఇందులో ఓ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఉండబోతుందని, ఈ సినిమా దాదాపు ఖరారు కూడా అయ్యిందని తెలుస్తుంది.ఇలా సినిమాలు పక్కనపెట్టి అఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే గతంలో ఈయన శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి తనతో నిశ్చితార్థం జరుపుకున్నారు.కొన్ని కారణాలవల్ల ఆ నిశ్చితార్థ బ్రేకప్ అయింది.అయితే కొన్ని సంవత్సరాల పాటు జైనాబ్( Zainab ) అనే యువతీతో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఇటీవల వీరిద్దరీ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే.మార్చిలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వస్తున్నా ఇంకా ఇప్పటికి ఈ పెళ్లి గురించి అక్కినేని కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.ఇక నిశ్చితార్థం తర్వాత మొదటిసారి అఖిల్ తనకు కాబోయే భార్య జైనాబ్ తో కలిసి పబ్లిక్ గా కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
ఇలా వీరిద్దరు కలసి వెళ్లడంతో ఏదైనా వెకేషన్ కోసం వెళ్తున్నారా లేకపోతే పెళ్లి కోసం షాపింగ్ చేయడానికి విదేశాలకు వెళుతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు అభిమానులైతే వీరిద్దరూ ఇలా మొదటిసారి బయట కనిపించడంతో వీరిద్దరికీ దిష్టి తగిలి ఉంటుందని వెంటనే దిష్టి తీసేయండి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.







