టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టి “హ్యాట్రిక్ హీరో” ( Hatrick Hero )అనే బిరుదు పొందిన నటులు కొందరే ఉన్నారు.వారిలో తాజాగా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty )చేరి ఆశ్చర్యపరుస్తున్నాడు.
సమంత లాంటి అగ్ర హీరోయిన్ల చేత కూడా ఇతడు పొగిడించుకుంటున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నవీన్ పొలిశెట్టిని మెచ్చుకున్నాడు.“నీ కామెడీ టైమింగ్ సూపర్ అంటూ, నీ యాక్టింగ్ స్కిల్స్ ముందు అనుష్క కూడా తేలిపోయిందంటూ” చాలామంది సెలబ్రిటీలు, ప్రేక్షకులు నవీన్ ప్రతిభ పై కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలతో వరుసగా మూడు విజయాలు సాధించి హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు నవీన్ పొలిశెట్టి.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అతను డి ఫర్ దోపిడీ, 1 నేనొక్కడినే చిత్రాలలో చిన్న పాత్రల్లో కనిపించాడు.నవీన్ హీరోగా నటించిన మొదటి చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019) మంచి విజయం సాధించింది.

ఆ తర్వాత బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జాతిరత్నాలు’( Jati Ratnalu ) చిత్రంతో స్టార్డంలో దూసుకుపోయాడు.జాతి రత్నాలు సినిమాని వన్ మాన్ షోగా ముందుకు నడిపించాడు.ఎమోషన్స్ బాగా పలికించగలిగాడు.పంచ్ లైన్స్, సెటైర్లు తూటాల్లాగా పేలుస్తూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.అతడి డైలాగు డెలివరీ, కామెడీ టైమింగ్ వేరే లెవల్లో ఉందని క్రిటిక్స్ కూడా పొగిడారు.

మళ్లీ రెండేళ్ల తర్వాత అతను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నవీన్ హీరోగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’( Miss Shetty Mr Polishetty ) సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది.ఇది కూడా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది.అలా మొత్తంగా చూసుకుంటే మూడు వరుస విజయాలతో నవీన్ పొలిశెట్టి “హ్యాట్రిక్ హీరో” అనే బిరుదును సంపాదించుకున్నాడు.
మరి రాబోయే సినిమాలతో తన విజయాల పరంపరను కొనసాగించగలడో లేదో చూడాలి.ప్రస్తుతమైతే ఈ యంగ్ హీరో తన సినిమాని ప్రమోట్ చేయడానికి అమెరికా టూర్ వేస్తున్నాడు.