పదేళ్ల క్రితం హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వాని( Kiara Advani ) పెళ్లి తర్వాత తన జోరుని పెంచింది గతంలో తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అలాగే మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించగా, కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే ఘన విజయం సాధించింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిస్తే తన పేరు మారుమోగిపోతుంది అనే భావనలో ఆమె ఉండటం ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెంచడానికి గల కారణం.
ఇక ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలు మాత్రమే ఉండడం విశేషం బాలీవుడ్ లో ఒక్క చిత్రంలో కూడ నటించని కియార మూడు తెలుగు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.

త్రిబుల్ ఆర్ కాంబినేషన్ లో రామ్ చరణ్ తో ఇదివరకే నటించిన కియారా మరోమారు రామ్ చరణ్ ( Ram Charan ) తో జోడీ కట్టి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది.మరి కేవలం రామ్ చరణ్ తో మాత్రమే నటిస్తే ఎలా ఉంటుంది అనుకుందో ఏమో జూనియర్ ఎన్టీఆర్ తో నటించడానికి వార్ 2 సినిమాలో మంచి పాత్ర లో నటిస్తుంది.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ తో సలార్( Salar ) సిక్వెల్ లో కూడా జోడీ కట్టనుంది అనే విషయం ప్రస్తుతం తెలుస్తోంది.
ఇలా టాలీవుడ్ లోని ముగ్గురు స్టార్ హీరోలతో ప్రస్తుతం కియారా అద్వానీ జోడీ కట్టి నటించడం బాలీవుడ్ హీరోయిన్స్ కి మింగుడు పడటం లేదు.

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది సౌత్ ఇండియా పై ఫోకస్ పెట్టారు కానీ ఈ రేంజ్ లో సినిమాలను ఒప్పుకుంటున్న హీరోయిన్ మాత్రం కేవలం కియారా మాత్రమే.ఎందుకు చెప్పుకోదగ్గ ముఖ్య కారణం ఏంటి అంటే సౌత్ హీరోలతో నటిస్తే నార్త్ లో తన పేరు మారు మోగిపోతుందని అలాగే విపరీతమైన ప్రమోషన్ దొరుకుతుంది అనే భావనలో ఆమె ఉందట.అందుకే వరుసగా సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఇక్కడ సినిమాలను ఒప్పుకుంటుంది.
మరి చూడాలి ఈ లేటు వయసులో ఈ అమ్మడు ఏ మేరకు రాణిస్తుందో.