ఇంట్లో నల్లులు,తలలో పేలు.చెవినొప్పి,దగ్గు ఇలా ఎలాంటి సమస్యనైనా చిటికెలో దూరం చేసే శక్తి ఆల్కహాల్ కి ఉంది.
ఏంటి ఇండైరెక్ట్ గా ఆల్కహాల్ ప్రమోషనా అనుకుంటున్నారా.లేదండీ బాబూ.
మధ్యం తాగమని మేము చెప్పట్లేదు.మధ్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని మేం కూడా ఒప్పుకుంటాం….
కానీ ఆల్కహాల్ వలన మనం రోజు ఎదుర్కొనే కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు.ఆల్కహాల్ ను రుద్దితే అది క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది.
ఆల్కహాల్ ను కాస్మొటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు.దీనివలన ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
అవేంటో తెలుసుకోండి…
ఒక బాటిల్ లో ఆల్కహాల్ తీసుకొని మంచాలపై, పరుపులపై చల్లితే నల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఇలా చల్లడం వలన నల్లులు పెట్టే గుడ్లు చనిపోతాయి.
కొద్ది రోజులపాటు ఇలా చల్లితే నల్లుల బారినుండి శాశ్వత విముక్తి పొందవచ్చు.
డియోడరెంట్ గా కూడా పనిచేస్తుంది.
శరీరం నుంచి వచ్చే దుర్వాసన వలన మొదలయ్యే బాక్టీరియాను చంపుతుంది.అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి లేకపోతె చర్మ సంబందిత అలర్జీలు వస్తాయి.

ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు, ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది.దీన్ని శరీరంలోని దెబ్బలకు ఉపశమనం లా ఉపయోగించవచ్చు.
లావెండర్ నూనె ని ఆల్కహాల్ రెండింటిని కలిపి తలపై జుట్టుపై చల్లుకుంటే తలలో ఉన్న పేలను నిర్మూలించవచ్చు.ఈ విధంగా చల్లిన తర్వాత తలను దువ్వుకుంటే చనిపోయిన పేలన్నీ బయట పడతాయి.
చాలా మంది తమ చెవులను శుబ్రపరుచుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు.అయితే దాని బదులు వెనిగర్ ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవిని శుబ్రపరచుకోవచ్చు.
విపరీతమైన దగ్గుతో బాదపడేవారు.ఆల్కహాల్లో నీరు,సోడా లాంటివేవి కలుపుకోకుండా రా (RAW) గా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.అలా అని ఎక్కువ ట్రై చేయకండి.