వాతావరణం చల్లగా ఉన్నా కూడా చెమటలు పడుతున్నాయా? అయితే ఈ అనారోగ్య సమస్య ఉన్నట్లే..!

వాతావరణం( weather ) వేడిగా ఉన్నప్పుడు చెమటలు పట్టడం సహజమైన విషయమే.కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా శరీరక శ్రమ పడినప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమటలు( sweat ) పడుతూ ఉంటాయి.

 Sweating Even When The Weather Is Cold But Like This Health Problem, Weather, H-TeluguStop.com

అది కూడా సహజమే.కానీ ఏ పని చేయకుండా కూర్చున్న కూడా చల్లని వాతావరణంలో చెమటలు పడుతూ ఉంటే దాన్ని తీవ్రంగా పరిగణించాలి.

ఇలా చెమటలు పట్టడం అంతర్లీనంగా దాగి ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్య లక్షణం అని కూడా చెప్పవచ్చు.ఆరోగ్యా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అధిక చమటలు పట్టడాన్ని డయాఫోరెసిస్ ( Diaphoresis )అంటారు.

హార్వర్డ్ హెల్త్ ప్రకారం నిద్రపోతున్నప్పుడు కూడా డయాఫోరేసిస్ సమస్య ఇబ్బంది పెడుతుంది.ఎక్కువగా ఇది యుక్త వయసులో మొదలవుతుంది.

దీని లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ వ్యాధి ఉన్నవారిలో విపరీతమైన చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చేతుల్లో చెమట పట్టడం, మానసిక ఆందోళన, బరువు తగ్గడం, తల తిరగడం, మసకబారిన చూపు లాంటి లక్షణాలు ఉంటాయి.

Telugu Diaphoresis, Problem, Tips, Sleep-Telugu Health Tips

స్లీప్ ఫౌండేషన్( Sleep Foundation ) ప్రకారం దాదాపు 85 శాతం మంది మహిళలలో మోనోపాస్, పెరిమెనోపాజ్ సమయంలో చెమటలు, వేడి ఆవిర్లు కలుగుతాయి.ఈస్ట్రోజన్ హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల శరీరం వేడెక్కినట్లు అవుతుంది.ఇది మీ మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతుంది.దీనివల్ల అధిక చెమట, రాత్రి చెమటలు పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.మధుమేహంతో బాధపడే వారికి చెమటలు పడితే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.అప్పుడు ఏదైనా తీపి పదార్థాలను తినడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుకోవచ్చు.

హైపర్ థైరాయిడిజంలో అధిక థైరాక్సిన్ ఉత్పత్తి అవుతుంది.అప్పుడు అధిక చెమటను కలిగిస్తుంది.

ఇది జరిగినప్పుడు మీ జీవక్రియ కూడా వేగవంతమవుతుంది.గుండె వేగంగా, కొట్టుకోవడం నిద్రలేమి, గుండెపోటు కూడా కావచ్చు.

ధమనుల్లో ఏదైనా అడ్డుపడడం వల్ల గుండెపోటు సంభవించే అవకాశం ఉంది.అప్పుడు అధికంగా చెమటలు పడతాయి.

ఇంకా చెప్పాలంటే లింఫోమా, లుకేమియా, ఎముక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లలో, డయాఫోరేసిస్ అనేది ఒక సాధారణ లక్షణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube